Ads
తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలు అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లు తమ నటనతో ఆడియెన్స్ ని ఆకట్టుకుంటున్నారు. వీరి సినిమాలకి సౌత్ ఇండియాలో ఎంతో క్రేజ్ ఉంది. ఈ హీరోలకి యాక్టింగ్ పరంగా మెలుకువలు నేర్పించి, కోచింగ్ ఇచ్చింది స్టార్ మేకర్ సత్యానంద్.
Ads
అయితే ఆయన గురించి ఇప్పటికీ కూడా ఎక్కువ మంది ఆడియెన్స్ కి తెలియదని చెప్పవచ్చు. కొందరికి స్టార్ మేకర్ సత్యానంద్ అని తెలియకపోవచ్చు. కానీ ఒక క్రిమినల్ ప్రేమ కథ సినిమాలో హీరోయిన్ కు “మావయ్య” క్యారెక్టర్ చేసిన యాక్టర్ అంటే గుర్తు పడతారు. ఇటీవల స్టార్ మేకర్ సత్యానంద్ ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఆడియెన్స్ తో పంచుకున్నాడు. ఆయన ఇప్పటిదాకా సుమారుగా వందకు పైగా హీరోలకి యాక్టింగ్ లో శిక్షణ ఇచ్చానని తెలియచేసారు.
అది మాత్రమే కాకుండా తన కోచింగ్ అకాడమీలో కోచింగ్ తీసుకున్న ఇంకో డెబ్బై మంది నటీనటులు కూడా తెలుగు సినీ పరిశ్రమలో పాపులర్ ఆర్టిస్టులుగా కొనసాగుతున్నారని తెలిపాడు. ఇక తాను గతంలో కోచింగ్ ఇచ్చిన హీరోలు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా దూసుకెళ్తున్నారని చెప్పారు. వారిని చూస్తే చాలా సంతోషంగా ఉందని సత్యానంద్ ఎమోషనల్ అయ్యారు. అలాగే యంగ్ హీరోలలో కూడా తన శిష్యులు ఉన్నారని తెలిపారు. వారిలో మెగాస్టార్ మేనల్లుడు అయిన సాయి ధరమ్ తేజ్ తనకు ప్రియమైన శిష్యుడు అని చెప్పారు. సాయి ధరమ్ తేజ్ కి నటనలో చాలా టాలెంట్ ఉందని, నిరూపించుకోవడం కోసం చాలా కష్టపడతాడని తెలియచేసారు. తన అకాడమీలో అందరిని చేర్చుకోమని, ముందుగా విద్యార్థిలో యాక్టర్ కి కావాల్సిన లక్షణాలు ఉన్నాయా? లేదా అని టెస్ట్ చేసిన తరువాతనే అకాడమీలో చేర్చుకుంటామని చెప్పారు. అలా వచ్చిన వారిలో యాక్టర్ కి కావాల్సిన లక్షణాలు లేకపోతే నటుడిగా పనికిరావని చెప్పి పంపిస్తామని తెలిపారు. ఎందుకంటే జీవితంలో సమయం, డబ్బు చాలా విలువైనవి. కాబట్టి డబ్బు సంపాదించడం కోసం ఇతరుల టైమ్ ని వృధా చేయడం గాని, మోసం చేయడం ఇష్టము లేదని తెలిపారు. టాలీవుడ్ లో చాలా మందిని హీరోలుగా తయారుచేసిన ఆయన వెండి తెరపై మాత్రం ఎక్కువగా కనిపించలేదు.
Also Read: వెంకటేష్ ”నువ్వు నాకు నచ్చావ్” మూవీని ఎన్నోసార్లు చూసినా ఈ మిస్టేక్ ని గమనించలేదు..!