డైరెక్టర్ పరుశురాం, పూరి జగన్నాథ్ ల మధ్య ఉన్న సంబంధం ఏమిటో తెలుసా?

Ads

సాధారణంగా సిని పరిశ్రమలో ఎవరైనా విజయం సాధించినపుడు వారి ద్వారా వారికి తెలిసిన వారు కానీ, మిత్రులు కానీ, బంధువులు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటారు. ఇక సినిమా ఇండస్ట్రీలోకి అలా వచ్చిన వారు ఎక్కువగానే ఉన్నారు.

Ads

టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు అయిన పూరి జగన్నాధ్ సినీ పరిశ్రమలో అడుగు పెట్టి, ఇండస్ట్రీలో మంచి దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆయన పెద్ద హీరోలతో వరుసగా చిత్రాలు తెరకెక్కించి తన సినిమాలకి ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. కాగా పూరిజగన్నాథ్ ఎటువంటి సినీ నేపద్యం లేకుండానే ఇండస్ట్రీకి వచ్చి, కష్టపడుతూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ అగ్ర దర్శకుడిగా ఎదిగారు.
అలాంటి పూరిజగన్నాథ్ ని ఆదర్శంగా తీసుకొని సినీ పరిశ్రమకి వచ్చిన వారు చాలామంది ఉన్నారు. వారిలో పరుశురాం పెట్ల ఒకరు. ఇక పరుశురాం కూడా సినిమా అంటే పిచ్చి ప్రేమతో పూరిజగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయి పని నేర్చుకొని, ఆ తరువాత దర్శకుడుగా మారారు. అంతేకాకుండా పరుశురాం, పూరి జగన్నాథ్ లు అన్నదమ్ములు కూడా. వీళ్ల ఇద్దరి ఇంటి పేర్లు పెట్లనే. పెట్ల పూరి జగన్నాథ్, పెట్ల పరుశురాంలు ఒకే ఫ్యామిలికి చెందినవారు.
పరుశురాం ఇండస్ట్రీకి వస్తాను అన్నయ్య అని పూరి జగన్నాథ్ కి చెప్పినపుడు ఆయన మొదట్లో ఇండస్ట్రీలో విజయం పొందడం చాలా కష్టంతో కూడుకున్నది. కాబట్టి బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసుకోమని చెప్పాడంట. అయితే పూరీ ఎంతగా చెప్పినప్పటికి పరుశురాం వినలేదంట. దాంతో పూరి జగన్నాథ్ తన డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోకి పరుశురాంని చేర్చుకున్నారంట. ఆ విధంగా డైరెక్టర్ పరుశురాం తన సిని ప్రయాణాన్ని ప్రారంభించారు. పరుశురాం మంచి డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకుని, గీత గోవిందం, సర్కారు వారి పాట చిత్రాలతో విజయాలు పొంది అగ్ర దర్శకుల జాబితాలోకి చేరాడు. ప్రస్తుతం పరుశురాం హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేయబోతున్నారని సమాచారం.
Also Read: టాలీవుడ్ స్టార్ హీరోలకి యాక్టింగ్ నేర్పిన గురువు గురించి తెలుసా?

Previous articleక్రికెట్ ఆడే సమయంలో.. కొందరు ”రెండు క్యాప్స్” ని ఎందుకు పెట్టుకుంటారో తెలుసా.?
Next articleరైల్వే సీట్స్ లో “A” అని ఎందుకు ఉంటుంది.. దాని అర్ధం ఏమిటో తెలుసా..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.