రైల్వే సీట్స్ లో “A” అని ఎందుకు ఉంటుంది.. దాని అర్ధం ఏమిటో తెలుసా..?

Ads

రైలు ప్రయాణం ఎంతో సౌకర్యంగా ఉంటుంది పైగా దూర ప్రయాణాలను కూడా మనం ఎంతో కంఫర్ట్ గా చేసేయొచ్చు. అందుకే చాలా మంది దూర దూర ప్రాంతాలకి ట్రైన్ లో వెళ్తూ వుంటారు. ట్రైన్ ని ప్రిఫర్ చేస్తారు. పైగా ట్రైన్ లో రాత్రి హాయిగా నిద్రపోవచ్చు. విండో పక్కన కూర్చుని ప్రకృతిని చూస్తూ ఉంటే సమయం అసలు తెలియనే తెలియదు.

చాలా మంది ట్రైన్ జర్నీ ని అందుకే ఇష్ట పడుతూ ఉంటారు. అయితే మనం ఎప్పుడైనా ప్రయాణం చేసేటప్పుడు బయట ప్రకృతిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాము.

Ads

కానీ ట్రైన్ లో ఉండే వాటిని పట్టించుకోము. మీరు కూడా చాలా సార్లు ట్రైన్ ఎక్కే ఉంటారు కానీ పరిసరాలు మీద దృష్టి పెట్టి ఉండరు. ఈ విషయాన్ని చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. ట్రైన్ లో బెర్తుల మీద కొన్ని అక్షరాలు రాసి ఉంటాయి. ఉదాహరణకి విండో సీట్ దగ్గర ”w” అని రాసి ఉంటుంది. కార్నర్ సీట్ దగ్గర చూస్తే ”A ” అని ఉంటుంది. ఎందుకు ”A ” అని రాసి ఉంటుంది..? దాని అర్ధం ఏమిటి అనేది ఇప్పుడే తెలుసుకుందాం.

విండో సీటు కి అయితే ”W” అని రాసి ఉంటుంది. అదే మధ్య లో వుండే సీటు కి అయితే ”M ” అని రాసి ఉంటుంది. అదే చివరిగా వుండే సీటు కి అయితే ”A ” అని ఉంటుంది. ఏ అంటే అసైల్ అని దానికి అర్ధం. అసైల్ అంటే నడిచేందుకు వీలు ఉందని అర్ధం. అందుకే చివరి ఉన్న సీటుని అసైల్ సీటు అని అంటారు. అదే మనం స్లీపర్ క్లాస్ లో చూస్తే ఇలా ఉండదు. స్లీపర్ క్లాస్ లో లోయర్ బెర్త్, మిడిల్ బెర్త్, అప్పర్ బెర్త్ అని ఉంటుంది.

Previous articleడైరెక్టర్ పరుశురాం, పూరి జగన్నాథ్ ల మధ్య ఉన్న సంబంధం ఏమిటో తెలుసా?
Next articleతెలుగు సినిమాలలో రీమిక్స్ చేసిన 20 సాంగ్స్..