Ads
కలలని నెరవేర్చుకోవాలని చాలా మంది ఇండస్ట్రీలోకి వస్తారు అయితే అనుకున్నంత మాత్రాన అంతా పెద్ద స్టార్లు అయిపోలేరు. ట్యాలెంట్, అదృష్టం రెండూ ఉంటేనే పెద్ద స్టార్లు అవ్వగలరు. అలానే అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఓ ఎత్తు అయితే ఇండస్ట్రీలో ఒక రికార్డును కొట్టడం మరొక ఎత్తు. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ని కొట్టి టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీలు కూడా ఉన్నారు.
మరి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కొట్టి టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీలు వివరాలని.. వారు ఎవరు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. అప్పట్లో కొంతమంది టాలీవుడ్ నటులు ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానాన్ని సంపాదించుకున్నారు. దీనితో మన టాలీవుడ్ ఇండస్ట్రీ మరో లెవెల్ కి వెళ్ళిపోయింది. ఇక మరి వారెవరు అనేది చూద్దాం.
#1. బ్రహ్మానందం:
బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కామెడీ తో బ్రహ్మానందం అందరినీ ఫిదా చేసేస్తూ ఉంటారు. ఈ లెజెండ్రీ కమెడియన్ వెయ్యికి పైగా సినిమాల్లో నటించారు. బ్రహ్మానందం 2010లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్నారు.
#2. విజయనిర్మల:
Ads
2000 సంవత్సరంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో విజయ్ నిర్మల చోటు సంపాదించుకోవడం జరిగింది. ఈమె తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలకి దర్శకత్వం వహించారు.
#3. రామానాయుడు:
మంచి ప్రొడ్యూసర్ ఈయన. మూవీ మొగల్ రామానాయుడు కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకోవడం జరిగింది. అత్యధిక సినిమాలని అందించిన నిర్మాతగా ఈయనకి 2008 లో ఈ అవకాశం వచ్చింది.
#4. సుశీల:
ఈమె కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు. 18 వేలు పాటలు పాడి ఈ రికార్డుని సొంతం చేసుకోవడం జరిగింది.
#5. ఎస్పీ బాలసుబ్రమణ్యం:
2001లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఈయనకి చోటు దొరికింది ఈయన 40,000 పాటలు పాడారు.
#6. గజల్ శ్రీనివాస్:
100 భాషల్లో 100 గజల్స్ పాడిన సింగర్ గా 2008లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు.