Ads
కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు సందేశాత్మక అంశాలను జోడించి ఆడియెన్స్ ని మెప్పించే దర్శకుడు కొరటాల శివ. అలాంటి దర్శకుడు మెగాస్టార్ చిరంజీవితో మూవీ తెరకెక్కిస్తున్నాడు అనగానే ఆ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
Ads
అందులోనూ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నారంటే అభిమానులకి పండగే అని భావించారు. కానీ ఆచార్య మూవీ విడుదల అయ్యాక ఆ సినిమా అటు అభిమానులను, ఇటు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రంలో దర్శకత్వంలోనూ, మాటల్లోనూ కొరటాల మార్క్ ఎక్కడా కనిపించదు. దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశపరిచింది. అయితే ఆ ప్రభావం మెగాస్టార్ చిరంజీవి మీదనే ఎక్కువగా పడింది.
ఈ చిత్రం పరాజయం చెందడంతో మెగాస్టార్ చిరంజీవిని సామాజికమధ్యమాలలో ట్రోలింగ్ చేశారు. అయితే ఈ మూవీకి ఫ్లాప్ టాక్ రావడంతో రిలీజ్ అయిన కొన్నిరోజులకే ఓటీటీలో మరియు టెలివిజన్ లోనూ రిలీజ్ అయ్యింది. అయితే ఈ మూవీని థియేటర్ లో చూసిన ఆడియెన్స్ మూవీని మాత్రమే చూశారు. అందులో ఉన్న మిస్టేక్స్ ను గమనించలేదు.ఎప్పుడూ అయితే ఈ చిత్రం ఓటీటీలో వచ్చిందో అప్పుడు చూసినవారు అందులో ఉన్న మిస్టేక్స్ వెతికి పట్టుకొని మరి ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఆచార్యలో మెగాస్టార్ చిరంజీవి చేసిన ఒక పెద్ద మిస్టేక్ గమనించి నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇంతకి ఆ మిస్టేక్ ఏమిటి అంటే, ఈ సినిమాలో చిరంజీవి రథాన్ని తోసే సన్నివేశం ఒకటి ఉంటుంది. కొందరు ఆలయం ముందు నుండి రథాన్ని లాగుతూ ఉంటే, చిరంజీవి రధం వెనక నుండి ముందుకు తోస్తారు. అయితే ఆ సన్నివేశంలో చిరంజీవి కాళ్లకు షూ వేసుకుని ఉంటారు. వాస్తవానికి గుడిలోపలికి వెళ్లేటప్పుడు, దేవుడికి కోసం చేసే పనులలో భక్తులు అసలు చెప్పులను ధరించరన్న విషయం అందరికి తెలిసిందే. ఆచార్య సినిమా ఆలయాల గురించే తీసిన మూవీ. మరి అలాంటి సినిమాలో దేవుడి రథాన్ని పట్టుకున్నప్పుడు చెప్పులు వేసుకుంటారా? ఇంత పెద్ద మిస్టేక్ ని ఎలా చేసారని ట్రోల్ చేస్తున్నారు.
Also Read: ఆ స్టార్ డైరెక్టర్ కి కూతురు హీరోయిన్ గా నటించడం ఇష్టం లేదట.. ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా?