ఆ స్టార్ డైరెక్టర్ కి కూతురు హీరోయిన్ గా నటించడం ఇష్టం లేదట.. ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా?

Ads

డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన దర్శకత్వ ప్రతిభ గురించి సౌత్ ఆడియెన్స్ అందరికి తెలిసిందే. పాన్ ఇండియన్ మూవీస్ ట్రెండ్ ఇప్పుడు వచ్చింది. అయితే ఎప్పుడో డైరెక్టర్ శంకర్ పాన్ ఇండియన్ చిత్రాలను తెరకెక్కించారు.

Ads

సౌత్ సినీ పరిశ్రమను మరో లెవెల్ కి తీసుకెళ్లిన ఘనత ఆయనదే. ఆయనకి టెక్నాలజీ మీద ఉన్న అవగాహన, పరిజ్ఞానం ఏ దర్శకుడికి లేదని చెప్పడంలో ఎటువంటి సందేహం అక్కర లేదు. ఆయన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ని ఇచ్చాడు. ఎంతోమందిని స్టార్స్ గా మర్చారు. శంకర్ ప్రస్తుతం టాలీవుడ్ హీరో రామ్ చరణ్ తో ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తునారు. లోక నాయకుడు కమల్ హాసన్ తో భారతీయుడు2 చిత్రాన్ని ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే.డైరెక్టర్ శంకర్ కి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు. ఆయన పెద్ద కూతురు అదితి శంకర్ కి సినిమా హీరోయిన్ కావాలని కోరిక. ఆమె ‘విరుమాన్’ సినిమా ద్వారా హీరోయిన్ గా అడుగు పెట్టింది. ఈ సినిమాలో ఆమె తమిళ స్టార్ హీరో కార్తితో జోడీ కట్టింది. ఈ ‘విరుమాన్’ సినిమా తమిళనాడు స్టేట్ ని ఊపేసింది. అంతేకాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డు వసూళ్ల రాబట్టింది. కార్తీ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాస్ ని కలెక్ట్ చేసిన చిత్రంగా నిలిచింది. హీరోయిన్ గా పరిచయం అయిన తొలి సినిమానే భారీ హిట్ అవ్వడంతో అదితి శంకర్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.అయితే డైరెక్టర్ శంకర్ కి తన కూతురు అదితి హీరోయిన్ కావడం ఇష్టం లేదు. ఇక ఈ విషయాన్ని అదితినే ‘విరుమాన్’సినిమా ఆడియో వేడుకలో చెప్పింది. అయితే హీరోయిన్ గా విజయం సాధించలేకపోతే, సినిమాలను విడిచి వైద్య వృత్తినే కొనసాగిస్తానని శంకర్ కి నచ్చ చెప్పినదంట. ఇక ఆ సినిమాకి ముత్తయ్య దర్శకుడు, హీరో కార్తీ కావడం వల్ల ఒప్పుకున్నాడంట. అలా అదితి ‘విరుమాన్’ సినిమాతో కోలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.

Also Read: బాలయ్య ‘అఖండ’ సినిమాలో న‌టించిన ఈ నటి గురించి తెలుసా?

Previous articleతెలుగు సినిమాలలో రీమిక్స్ చేసిన 20 సాంగ్స్..
Next articleసీనియర్ హీరో శోభ‌న్ బాబు తన కొడుకును హీరోగా చేయ‌లేదు.. ఎందుకంటే?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.