Ads
తెలుగు సీనియర్ నటుడు రంగనాథ్ గురించి తెలుగు ఆడియెన్స్ కి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సుమారు 300 కి పైగా చిత్రాల్లో నటించారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా రంగనాథ్ ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించారు.
Ads
వెండితెర పైన మాత్రమే కాకుండా ఆయన బుల్లితెర సీరియల్స్‌లో కూడా నటించి, ఆకట్టుకున్నారు. ఆయన నటుడు మాత్రమే కాదు రచయిత కూడా. సాహితీవేత్తగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సినిమాలలో రాణిస్తున్న సమయంలోనే రంగనాథ్ 2015 లో డిసెంబర్ 19న, హైదరాబాద్ లోని, గాంధీ నగర్ లోని తన నివాసంలోనే ఫ్యాన్ సీలింగ్ కు ఉరి వేసుకుని ప్రాణం తీసుకున్నారు. అప్పటికి రంగనాథ్ 66 సంవత్సరాలు. అయితే ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు లేవని కుటుంబ సభ్యులు తెలిపారు. రంగనాథ్ కి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు వున్నారు.
ఆయన మరణించిన రోజున రంగనాథ్ మల్కాజిగిరిలో సన్మాన సభకు చీఫ్ గెస్ట్ గా వెళ్లాల్సి ఉంది. దాంతో ఆయనను తీసుకువెళ్ళడానికి సభ నిర్వాహకులు రంగనాథ్ నివాసానికి వచ్చారు. అయితే ఎంతగా తలుపు తట్టిన కూడా తలుపు తెరవకపోవడంతో అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆయన కూతురికి సమాచారం తెలిపారు.ఆమె అక్కడికి వచ్చిన తరువాత తలుపులు పగలకొట్టి లోపలికి వెళ్ళి చూడగా రంగనాథ్ ఫ్యాన్‌కు వేలాడుతూ ఉన్నారు.
రంగనాథ్ తన భార్యను ఎక్కువగా ప్రేమించేవారు. ఆమె అనారోగ్యం పాలైన అర్థాంగికి సుమారు పదిహేను ఏళ్లపాటు ఆయనే దగ్గరుండి సపర్యలు చేశారట. ఆమె మరణించడంతో రంగనాథ్ డిప్రెషన్ లోకి వెళ్లారు. ఆయన ఒంటరిగానే ఉండేవారు. ఆయనకు పనిమనిషి మీనాక్షివంట చేసి వెళ్ళేది.ఆయన దేవుని పటాల పక్కనే భార్య ఫోటోను పెట్టి పూజించేవారంట. అలా ఆయన డిప్రెషన్‌తోనే ప్రాణం తీసుకున్నారని అనుకుంటున్నారు.
చనిపోయే ముందు తన స్నేహితుడు అయిన ‘నేటి నిజం’ ఎడిటర్ అయిన బైసా దేవదాసుకు ‘గుడ్ బై సార్..’అని చివరిసారిగా తన మొబైల్ నుండి మెసేజ్ పంపారు.అంతేకాకుండా ఆయన ఉరి వేసుకున్న గదిలో గోడపైన ‘బీరువాలో మీనాక్షి పేరు మీద ఉన్న బ్యాంక్ బాండ్స్‌ను ఆమెకు ఇవ్వండని, అలాగే డోంట్ ట్రబుల్ హర్’ అని రాశారు. పనిమనిషి మీనాక్షి తనకు సేవ చేయడం వల్లనే, అలా రాశారని అందరు అప్పుడు భావించారు. అంతేకాకుండా రంగనాథ్ గోడపైన డెస్టినీ అని కూడా రాశారు.
Also Read: “అమిగోస్” మూవీ రివ్యూ.. కళ్యాణ్ రామ్ ఖాతాలో మరో హిట్ పడినట్టేనా?