“అమిగోస్” మూవీ రివ్యూ.. కళ్యాణ్ రామ్ ఖాతాలో మరో హిట్ పడినట్టేనా?

Ads

సినిమా : అమిగోస్
నటీనటులు : నందమూరి కళ్యాణ్ రామ్, ఆషికా రంగనాథ్, బ్రహ్మాజీ, సప్తగిరి.
దర్శకత్వం : రాజేంద్ర రెడ్డి
నిర్మాత : నవీన్ యెర్నేని, వై రవిశంకర్
సంగీతం : జిబ్రాన్
విడుదల తేదీ : ఫిబ్రవరి 10, 2023స్టోరీ :
సిద్ధార్థ్ (కళ్యాణ్ రామ్) హైదరాబాద్ లో నివసించే యువకుడు. అతను కుటుంబ వ్యాపారాలను చూసుకుంటూ ఉంటాడు. అతను ఇషిక (ఆషికా రంగనాథ్)ను ప్రేమిస్తాడు. ఆమెను పెళ్ళి చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. ఒకే పోలీకలతో ఉన్న మనుషులను కలిపే ఒక వెబ్‌సైట్‌ ద్వారా తనలాగే ఉన్న ఇంకో ఇద్దరు వ్యక్తులు అయిన మైఖేల్, మంజునాథ్ లను కలుస్తాడు. అలా వారు ముగ్గురూ క్లోజ్ అవుతారు. ఆ తరువాత మంజునాథ్ బెంగళూరు వెళ్లడానికి, మైఖేల్ కలకత్తా వెళ్లడానికి ఎవరి ఊరికి వారు బయలు దేరతారు. అయితే అప్పటికే మైఖేల్ హైదరాబాదులో ఎన్ఐఏ అధికారిని చంపేస్తాడు. ఆ కేసు నుండి తాను తప్పించుకోవడం కోసం తనకు బదులుగా సిద్ధార్థ్ అరెస్ట్ అయ్యేలా చేస్తాడు. మైఖేల్ అనుకుని ఎన్ఐఏ ఎవరిని పట్టుకుంది? అరెస్ట్ తరువాత ఏం జరిగింది? దుర్మార్గుడు అయిన మైఖేల్ వేసిన అసలు పథకం ఏమిటి? మైఖేల్ నుండి సిద్ధార్థ్, మంజునాథ్ తప్పించుకున్నారా? లేదా? అనేది తెలియాలంటే అమిగోస్ మూవీ చూడాల్సిందే.
రివ్యూ :
బింబిసార తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన మూవీ కావడంతో ‘అమిగోస్’ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బింబిసారలో నెగిటివ్ షేడ్ పాత్రలో నటిస్తే, ఈ సినిమాలో విలన్ గా చేశారు. నటన మరియు యాటిట్యూడ్ పరంగా మూడు క్యారెక్టర్స్ లో కళ్యాణ్ రామ్ వేరియేషన్ చూపించారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న మైఖేల్ గా నటన, వాయిస్ మాడ్యులేషన్ ఆకట్టుకునేలా ఉంటాయి. కళ్యాణ్ రామ్ సినిమా మొత్తాన్ని నడిపించారు. హీరోయిన్ గా నటించిన ఆషికా రంగనాథ్ స్క్రీన్ ప్రజెన్స్ ఆకట్టుకుంటుంది. కానీ, నటిగా తన టాలెంట్ చూపించే ఛాన్స్ ఆమెకు రాలేదు. బ్రహ్మాజీ, సప్తగిరి, మిగతా నటీనటులు తమ పాత్రల తగ్గట్టుగా చేశారు.
దర్శకుడు ఎంపిక చేసుకున్న కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉంది. అయితే తెరకెక్కించడంలో కొన్ని లోపాలు కనిపిస్తూ ఉంటాయి. కథనం చాలా స్లోగా ఉంటుంది. థియేటర్లలో ఆడియెన్స్ పాత్రలతో కనెక్ట్ అయ్యేలా ఎమోషనల్ సీన్స్ సోసోగానే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. జిబ్రాన్ ఇచ్చిన సాంగ్స్ బాగున్నాయి. వాటిలో ‘ఎన్నో రాత్రులొస్తాయి గానీ’ పాట రీమిక్స్ వినడానికి, తెర మీద చూడటానికి బావుంది. జిబ్రాన్ అందించిన నేపథ్య సంగీతం ఇంటర్వెల్ అనతరం ఇంపాక్ట్ చూపించింది.
ప్లస్ పాయింట్స్ :
కళ్యాణ్ రామ్ నటన
యాక్షన్ సన్నివేశాలు
అషికా రంగనాథ్ గ్లామర్

Ads

మైనస్ పాయింట్స్:
స్క్రీన్ ప్లే
రోటీన్ నేరేషన్

రేటింగ్ : 2.5/5

ట్యాగ్ లైన్ :
అమిగోస్ కాన్సెప్టు బాగున్నా, రోటీన్ నేరేషన్, యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి నచ్చే మూవీ..

Previous articleదీపారాధన చేస్తున్నప్పుడు.. ఈ 5 తప్పులని అస్సలు చెయ్యకండి..!
Next articleSHIVA VEDHA REVIEW : ”శివ వేద” సినిమా ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్…!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.