పునీత్ రాజ్ కుమార్ టూ తారకరత్న.. ఇటీవల కాలంలో గుండెపోటుతో కన్నుమూసిన 7గురు సెలెబ్రిటీలు..

Ads

ఇటీవల కాలంలో సినీ పరిశ్రమను వరుసగా విషాదాలు వెంటాడుతున్నాయి. అయితే మరణిస్తున్నవారిలో నాలుగు పదుల వయసులో కన్నుమూస్తూన్న సినీ ప్రముఖులు ఎక్కువ మంది ఉన్నారు. వారి మరణానికి కారణం గుండెపోటు.

Ads

తక్కువ వయసులోనే వారు మరణించి వారి అభిమానులకు, కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. గత పద్దెనిమిది నెలల్లోనే ఏడుగురు ప్రముఖులు చిన్న వయసులోనే కన్నుమూశారు. అలా చిన్నవయసులోనే చనిపోయిన సెలెబ్రిటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం..
1.పునీత్ రాజ్ కుమార్ :
కన్నడ సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న పునీత్ రాజ్ కుమార్ 2021 అక్టోబర్ 29న రోజు లాగే జిమ్ లో వ్యాయామం చేస్తూ హఠాత్తుగా గుండెపోటు రావడంతో కుప్పకూలారు. హాస్పటల్ కి తరలించే లోగానే కన్నుమూశారు. పునీత్ 46 సంవత్సరాల వయసులోనే మరణించి అభిమానులకు తీరని శోకాన్ని మిగిల్చారు.
2.సిద్ధార్థ్ శుక్లా :
బాలికా వధు, బిగ్ బాస్ వంటి ప్రోగ్రామ్స్ తో బాగా పాపులర్ అయిన బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లా 40 సంవత్సరాలకే గుండెపోటుతో 2021లో సెప్టెంబర్ 2న కన్నుమూశారు. ఆరోజు రాత్రి భోజనం చేసి పడుకున్న సిద్ధార్థ్ కి నిద్రలోనే గుండెపోటు రావడంతో నిద్రలోనే తుదిశ్వాస విడిచారు.
3.సింగర్ కెకె :
ప్రముఖ గాయకుడు కెకె 53 సంవత్సరాల వయసులో కోల్ కత్తాలో 2022 మే 31న ఒక కాలేజ్ వేడుకలో భాగంగా ప్రదర్శన ఇస్తుండగా గుండెపోటుతో రావడంతో హఠాత్తుగా కుప్పకూలిపోయారు. ఆ తరువాత కెకె లేవలేదు. ఆయన గుండెపోటుతో మరణించినట్టు డాక్టర్లు వెల్లడించారు.4.మేకపాటి గౌతమ్ రెడ్డి :
ఆంధ్రప్రదేశ్ ఐటి మంత్రిగా ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో 2022లో ఫిబ్రవరి 21న మరణించారు. ఆయన మరణం కుటుంబ సభ్యులను, పార్టీ నాయకులను శోకంలో ముంచంది. ఆయన 49 సంవత్సరాల వయసులోనే కన్నుమూశారు. అయితే ఆరోగ్య విషయంలో ఎంతో శ్రద్ధగా ఉండే ఆయన మరణం ఫ్యామిలీ మెంబర్స్ కి షాక్ ఇచ్చింది అని చెప్పవచ్చు.5.సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ :
ప్రముఖ టెలివిజన్ యాక్టర్ సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ కూడా గుండెపోటుతో మరణించారు. ఆయన 2022 నవంబర్ 1న జిమ్ లో వ్యాయామం చేస్తూండగా గుండెపోటు రావడంతో కుప్పకూలారు.
6.రాజు శ్రీవాత్సవ :
ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ ద్వారా పాపులర్ అయిన రాజు శ్రీవాత్సవ 2022 సెప్టెంబర్ 21న కన్నుమూశారు. శ్రీవాత్సవ జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో హాస్పటల్ చేర్చారు. నలబై రోజుల ట్రీట్మెంట్ తర్వాత ఆయన కన్నుమూశారు.7.నందమూరి తారకరత్న :
నందమూరి తారకరత్న గుండెపోటుతో 2023 ఫిబ్రవరి 18న కన్నుమూశారు. నలబై సంవత్సరాల వయసులోనే తారకరత్న గుండెపోటుతో కన్నుమూయడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపింది. తారకరత్న జనవరి 27న యువగళం పాదయాత్రలో ఉండగా గుండె పోటు రావడంతో కుప్పకూలారు. 23 రోజుల ట్రీట్మెంట్ తర్వాత తారకరత్న తుదిశ్వాస విడిచారు.
Also Read: జగ్గు భాయ్ ఇక పై తాత కాలేడు.. పెద్ద కుమార్తె అలా.. చిన్న కూతురు ఇలా…

Previous articleప్రాణస్నేహితుడు మరణించినా చివరి చూపుకు వెళ్ళని రజినీకాంత్.. ఎందుకో తెలుసా?
Next articleఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘కొమురం భీముడో పాట’ వెనుక ఉన్న స్టోరిని చెప్పిన రాజమౌళి..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.