జగ్గు భాయ్ ఇక పై తాత కాలేడు.. పెద్ద కుమార్తె అలా.. చిన్న కూతురు ఇలా…

Ads

పెళ్లి అంటే నూరేళ్ళ పంట అనేది పెద్దల మాట. కానీ ప్రస్తుతం ఉన్న యువత పెళ్లి జీవితానికి అవసరమా అంటున్నారు. ఇక దీనిపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉండడం అనేది సహజమే.  కానీ ఇటీవల కాలంలో యువత మైండ్ సెట్ చాలా మారిపోయింది.

Ads

వివాహం చేసుకుంటే చాలా మట్టుకు ఫేక్‌గా ఉండాల్సి వస్తుందని కాబట్టి అలాంటి బాధ మాకు వద్దని అందరి ముందే చెప్తున్నారు. రామ్ గోపాల్ వర్మ, పూరి జగన్నాధ్ లాంటి వాళ్ళు వివాహం చేస్కుంటే బతుకు బస్టాండే అని చెప్తున్నారు. ఇక ఇదే విషయాన్ని టాలీవుడ్ యాక్టర్ జగపతి బాబు కూడా ఆయన స్టైల్లో చెబుతున్నారు.జగపతిబాబు ఒకప్పుడు తెలుగులో కుటుంబ చిత్రాలకు పెట్టింది పేరు. ఆయన కెరీర్ లో మావిడాకులు, ఆయనకు ఇద్దరు, శుభలగ్నం, మనోహరం, పెళ్లిపీటలు, బడ్జెట్‌ పద్మనాభం వంటి ఎన్నో ఫ్యామిలీ మూవీస్ ఉన్నాయి. ఆ విధనగా ఫ్యామిలీ హీరోగా టాలీవుడ్ లో మంచి గుర్తింపు పొందిన జగపతిబాబు ప్రస్తుతం సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో కూడా దూసుకుపోతున్నారు. జగ్గు భాయ్ తండ్రిగా, విలన్‌గా, సపోర్టింగ్‌ రోల్స్‌ చేస్తూ వరుస చిత్రాలలో నటిస్తున్నారు.
సినిమాల విషయం పక్కకు పెడితే జగపతిబాబు రియల్ లైఫ్ లో స్ట్రెయిట్‌ ఫార్వర్డ్‌ గా ఉంటారు. ఆయన ఏ విషయం గురించి అయినా సరే ముక్కుసూటిగా చెబుతారు. ఆయన ధోరణి మొదటి నుండి కూడా భిన్నంగా ఉంటారు. ప్రాక్టికల్ జీవితానికి చాలా దగ్గరగా ఉంటారు. జగ్గు భాయ్ తన పెద్ద కుమార్తె అమెరికన్‌ని ప్రేమించినపుడు ఒక్క మాట అడగకుండా, బంధువులు అందరు వ్యతిరేకించినప్పటికి దగ్గరుండి కూతురి వివాహాన్ని జరిపించారు. ఆ తరువాత పెద్ద కూతురు తమకు పిల్లల్ని వద్దు అని అనుకుంటున్నాం అంటే కూతురి నిర్ణయాన్ని ఒప్పుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఆమె ప్రస్తుతం పెట్స్ ను పెంచుకుంటుందని, సంతోషంగా ఉందని తెలిపారు.
జగపతి బాబు చిన్న కుమార్తెకు అయితే వివాహం చేయనని చెప్పారంట. తానైతే పెళ్లి చేసుకోమని బలవంతం చేయనని, ఒకవేళ ఆమె ఏవారిని అయినా పెళ్లి చేస్కుంటా అని తీసుకువస్తే వద్దు అననని తెలిపారు. కూతురుకు వివాహం చేయడం తండ్రి బాధ్యతని ఫీల్ కానని చెప్పారు. త్వరగా పిల్లలకు వివాహం చేయడం అంటే చేతులు దులిపేసుకోవడమని, అది స్వార్థమని తెలిపారు. పెళ్లి అనేది పెద్ద నిర్ణయం అని, అది ఎవరికి వారే తీసుకోవాలి అన్నారు. ఇప్పుడున్న సమాజంలో విడాకులు సాధారణం అయ్యాయని, ఇలాంటి కండిషన్ లో పిల్లలను పేరెంట్స్ నుండి వేరు చేయడానికి బదులు కనకపోవడమే మంచిది అని కామెంట్స్ చేశారు. ఇద్దరు కూతుర్లు అలానే నిర్ణయాలు తీసుకున్నట్లయితే మీరు ఎప్పటికీ తాత కాలేరు కదా అని అడిగితే, దానికి ఆయన తాత అయితే ఎంత, తాత కాకపోతే ఎంత అని కొట్టి పడేశారు.

Also Read: అజ్ఞాతవాసి చిత్రంలో పవన్‌ కళ్యాణ్ మెడలో ధరించిన లాకెట్‌ గురించి తెలుసా?

Previous articleఐరన్ లోపమా..? ఇలా ఈజీగా గుర్తించి.. ఈ ఆహారాన్ని తీసుకుంటే సరి..!
Next articleపవన్ కళ్యాణ్‌ హీరోయిన్ ‘ముంతాజ్’ ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.