డబ్బులు చదివించేటప్పుడు ”116, 516,1116” ఇలానే ఎందుకు ఇస్తారు..? కారణం ఇదే..!

Ads

మనకి తెలియని కొత్త విషయాలు తెలుసుకోవడం ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చిన్న చిన్న విషయాలైనా సరే మనకి దాని వెనక కారణాన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. గుడ్డిగా మన పూర్వీకులు చెప్పారనో వాళ్లు అనుసరిస్తున్నారు అనో మనం కూడా ఫాలో అయిపోతూ ఉంటాం. కానీ దాని వెనుక కారణాన్ని తెలుసుకోము. ఈరోజు ఎప్పటి నుండో మన పెద్దలు అనుసరిస్తున్న ఓ పద్ధతి వెనక కారణాన్ని చూద్దాం.

పెళ్లి కానీ లేదంటే ఇతర ఫంక్షన్లు కానీ అయితే మనం డబ్బులు ఇస్తూ ఉంటాం. డబ్బులు చదివించేటప్పుడు 116, 516,1116 ఇలా డబ్బులు పెడుతూ ఉంటాము.

Ads

చాలా మంది ఇలా చేస్తారని మనం కూడా దీనినే అనుసరిస్తూ ఉంటున్నాము. అయితే ఎందుకు చదివింపుల్లో ఇలా చివరన 16 రూపాయలు వచ్చేలా ఇవ్వాలి..? దీని వెనక కారణం ఏమిటి..? అసలు ఏమైనా కారణం ఉందా లేదంటే ఊరికే మనం కూడా ఫాలో అయిపోతున్నామా అనే విషయాన్ని ఇప్పుడు చూసేద్దాం. నిజాం సంస్థానం లో వేరే రాజ్యాంగం అమలు లో ఉండేది. కనుక అక్కడ వేరే నాణేలు ని వాడేవారు. అక్కడి రూపాయి విలువని చూస్తే.. వంద రూపాయలు ని కనుక ఇస్తే అక్కడ మాత్రం దాని విలువ తొంబై రూపాయిలే అయ్యేవి.

అందుకే అక్కడ పండితులకి తక్కువ ఇవ్వకూడదని ఇంకో 16 చేర్చి ఇచ్చేవారు. అప్పుడు వారికి తక్కువ ఇచ్చారని ఉండదు. 116 రూపాయలు ఇస్తే 100 రూపాయలకు సమానం. అందుకే పదహారు చేర్చి ఇచ్చేవారు. ఇలా 116, 516,1116 ఇవ్వడం మొదలైంది. అలా ఎప్పుడో వచ్చిన ఈ పద్దతిని ఇప్పుడు కూడా మన వాళ్ళు పాటిస్తున్నారు. పెళ్లిళ్లు లేదంటే ఏదైనా ఫంక్షన్ అప్పుడు 116, 516,1116 చదివిస్తున్నారు.

 

Previous articleప్రభాస్ ”ప్రాజెక్ట్ కె” ఒక యుగాంతం క‌థ‌…!
Next articleతెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ స్టార్స్ వీరే..