తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ స్టార్స్ వీరే..

Ads

కొంత కాలంగా టాలీవుడ్ ఖ్యాతి అంతర్జాతీయంగా విస్తరిస్తోంది. పాన్ ఇండియా చిత్రాలతో పాటుగా పాన్ వరల్డ్ సినిమాలను కూడా తెలుగు సినీపరిశ్రమ నిర్మిస్తోంది. ఇక టాలీవుడ్ రేంజ్ ని ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రం బాహుబలి అని చెప్పవచ్చు.

ఆ తర్వాత కాలంలో వచ్చిన అల్లు అర్జున్ నటించిన పుష్ఫ, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలు టాలీవుడ్ ని మరోక మెట్టు ఎక్కించాయి. వీటితో టాలీవుడ్ హీరోలకు అంతర్జాతీయంగా క్రేజ్ వచ్చింది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి నెలకి సంబంధించి టాలీవుడ్ మోస్ట్ పాపులర్ హీరోల జాబితాను ఓర్ మ్యాక్స్ మీడియా విడుదల చేసింది. ఓర్మాక్స్ మీడియా అనే సంస్థ ప్రతి నెలలోనూ, అలాగే ప్రతి సంవత్సరం కూడా ఒక సర్వే నిర్వహించి, టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇతర సినీ పరిశ్రమలకు చెందిన హీరో, హీరోయిన్ల లిస్ట్ లను రిలీజ్ చేస్తుంది.
తాజాగా జనవరికి సంబంధించి ఓర్మాక్స్ జరిపిన సర్వే ప్రకారం మోస్ట్ పాపులర్ స్టార్స్ లిస్టును రిలీజ్ చేసింది. ఓర్మాక్స్ మీడియా రిలీజ్ చేసిన మోస్ట్ పాపులర్ స్టార్ హీరోల జాబితాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నెంబర్ వన్ గా నిలిచారు. అయితే ఇటీవల కాలంలో ప్రభాస్ సినిమాలు విడుదల కానప్పటికి ఆయనే మొదటి స్థానంలో ఉండడం విశేషం.ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ రెండవ స్థానంలో ఉండగా, మూడవ స్థానంలో రామ్ చరణ్ నిలిచారు. నాలుగవ స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఐదవ స్థానంలో మహేష్ బాబు నిలిచారు. పవన్ కళ్యాణ్ ఆరవ స్థానంలో ఉన్నారు. ఆ తరువాత వాల్తేర్ వీరయ్య మూవీతో విజయాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఏడవ స్థానంలో నిలిచారు. నేచురల్ స్టార్ నాని ఎనిమిదవ స్థానంలో, రవితేజ 9వ స్థానంలో, విజయ్ దేవరకొండ 10 వ స్థానంలో నిలిచారు.
ఇక మోస్ట్ పాపులర్ హీరోయిన్స్ లిస్ట్ చూసినట్లయితే ఎప్పటిలానే సమంత మొదటి స్థానంలో నిలిచింది. కాజల్ అగర్వాల్ రెండవ స్థానంలో, అనుష్క శెట్టి మూడవ స్థానంలో నిలిచారు. సాయి పల్లవి నాలుగవ స్థానంలో ఉండగా, రష్మిక ఐదవ స్థానంలో ఉన్నారు. పూజా హెగ్డే ఆరవ స్థానంలో తమన్నా ఏడవ స్థానంలో నిలిచారు. కీర్తి సురేష్ 8వ స్థానంలో, శ్రీలీల తొమ్మిదవ స్థానంలో శృతిహాసన్ 10 వ స్థానంలో నిలిచారు.

Ads

Also Read: ”అవతార్” సినిమాలో కొన్నింటిని మన పురాణాల నుండే తీసుకు వచ్చారా..? ఈ 5 అలానే ఉన్నాయిగా..!

Previous articleడబ్బులు చదివించేటప్పుడు ”116, 516,1116” ఇలానే ఎందుకు ఇస్తారు..? కారణం ఇదే..!
Next articleరేణుదేశాయ్ ఎలాంటి అనారోగ్య సమస్యతో బాధపడుతుందంటే..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.