Ads
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో హిట్ చిత్రాలలో నటించారు. ఆయన ఇండస్ట్రీలో నలబై ఏళ్లుగా స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. చిరంజీవి నటించిన సినిమాలలో శంకర్ దాదా ఎంబిబిఎస్ ఒకటి. ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది.
Ads
బాలీవుడ్ మూవీ మున్నా భాయ్ ఎంబిబిఎస్ మూవీ అక్కడ పెద్ద హిట్ గా నిలిచింది. ఆ మూవీని తెలుగులో రీమేక్ చేయాలనుకున్న చిరంజీవి ఆ మూవీ రీమేక్ రైట్స్ ని తీసుకున్నారు. ఆ సినిమాని మన నేటివిటీకి తగిన విధంగా మార్పులు చేయమని పరుచూరి బ్రదర్స్ కి అప్పగించాడు. ఈ చిత్రానికి డైరెక్టర్ గా జయంత్ సి పరాన్జీని ఎంపిక చేశారు. అంతకు ముందే చిరంజీవి, జయంత్ కలయికలో ‘బావగారు బాగున్నారా’ మూవీ వచ్చింది. ఈ చిత్రం హిట్ గా నిలిచింది. దాంతో మెగాస్టార్ జయంత్ ని డైరెక్టర్ గా ఎన్నుకున్నారు. ఈ చిత్రంలో హీరో తరువాత ముఖ్యమైన పాత్ర ఇంకోకటి కూడా ఉంది. అదే చిరంజీవికి తమ్ముడిగా కనిపించే ఏటియం క్యారెక్టర్. ఈ పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలా అని చాలా మందిని అనుకున్నారు.ఈ క్రమంలో ఒకరోజు చిరంజీవి దగ్గరికి వచ్చిన శ్రీకాంత్ అన్నయ్య నెక్స్ మూవీ ఏం చేస్తున్నారని అడిగారంట. అప్పుడు చిరు మున్నా భాయ్ రీమేక్ గురించి చెప్పి, ఏటియం పాత్ర కోసం వెతుకు తున్నామని, ఆయన ముందే కొంత మంది నటులను చూశారట. అయితే ఏటియం గురించి చెప్పగానే దాని కోసం శ్రీకాంత్ కి తనను అడిగితే బాగుండేది అనుకున్నారంట. కానీ చెప్తే కరక్ట్ కాదని చెప్పలేదంట.మెగాస్టార్ తో ఉన్న చనువుతో అడిగినట్లయితే అన్నయ్య తప్పకుండా ఇస్తారు. కానీ ఆ పాత్రకు నేను చేయగలను అనుకుంటే వాళ్ళే అడుగుతారు అని భావించాడంట. ఈ క్రమంలోనే ఓసారి చిరంజీవి ఎవరో ఎందుకు శ్రీకాంత్ ఏటియం క్యారెక్టర్ చేస్తావా? ఆసక్తి ఉందా అని అడిగడంతో శ్రీకాంత్ అన్నయ్య నువ్వు ఎప్పుడు ఇలా అడుగుతావా అని ఎదురు చూస్తున్నాను అన్నాడంట. ఆ విధంగా హీరో శ్రీకాంత్ ఈ చిత్రంలో ఏటియంగా అద్భుతంగా నటించాడు.
Also Read:నయనతార టు హన్సిక.. ముప్పై వస్తేనే కానీ ఈ 8 మంది హీరోయిన్స్ వివాహం చేసుకోలేదు..!