నయనతార టు హన్సిక.. ముప్పై వస్తేనే కానీ ఈ 8 మంది హీరోయిన్స్ వివాహం చేసుకోలేదు..!

Ads

బ్యాచిలర్ జీవితానికి, కుటుంబ జీవితానికి సంబంధం ఉండదు. కుటుంబ జీవితంలోకి ప్రవేశించిన తరువాత ఫ్యామిలీకి కూడా సమయం కేటాయించాల్సి వస్తుంది. అలా చేయలేకపోతే భార్యాభర్తల బంధంలో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది నటీనటులు ఈ కారణం వల్లనేమో పెళ్లి వయసు వచ్చిన వెంటనే వివాహం చేసుకోలేదు.

Ads

వర్క్ లైఫ్ ను సరిగా చేయలేక ఇబ్బందులు పడాల్సి వస్తుందేమోనని భావించి వారు వివాహాన్ని ఆలస్యం చేస్తూ వచ్చారు. ఇక ఈ విషయంలో కథానాయకలు మినహాయింపు కాదు. కొందరు హీరోయిన్స్ 30 వచ్చాకే వివాహ జీవితంలోకి అడుగు పెట్టారు. మరి 30 వచ్చాక పెళ్లి చేసుకున హీరోయిన్ల జాబితాలో ఎవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం..
1.శ్రీయ శరన్ :
36 సంవత్సరాల వయసులో రష్యా క్రీడాకారుడు ఆండ్రీని వివాహం చేసుకుంది. ఈ జంటకి ఒక పాప కూడా ఉంది.
2.కాజల్ :
35 సంవత్సరాల వచ్చాక కాజల్ తన చిన్ననాటి మిత్రుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకుంది. ఈ జంటకి ఓ బాబు జన్మించాడు.3.కలర్స్ స్వాతి :
31 సంవత్సరాల వయసులో స్వాతి బాయ్ ఫ్రెండ్ వికాస్ వాసుని వివాహం చేసుకుంది.4.నయనతార :
37 సంవత్సరాల వయసులో విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకుంది. ఈ దంపతులు సరోగసి పద్దతిలో కవలలకు జన్మనిచ్చారు.5.సమంత :
సమంత తన 30వ ఏట నాగ చైతన్యని పెళ్లి చేసుకుంది. కానీ 2021 లో వీరు విడాకులు తీసుకున్నారు.
6. హన్సిక :
31 సంవత్సరాల వయసులో తన స్నేహితుడు సోహైల్ ను హన్సిక పెళ్లి చేసుకుంది.7. నిక్కీ గల్రాని :
ఈమె 30 సంవత్సరాల వయసులో హీరో ఆది పినిశెట్టిని వివాహం చేసుకుంది.8. భాను శ్రీ మెహ్రా :
భాను శ్రీ 37 సంవత్సరాల వయసులో కరణ్ మానస్ ను వివాహం చేసుకుంది.

Also Read: ”అవతార్” సినిమాలో కొన్నింటిని మన పురాణాల నుండే తీసుకు వచ్చారా..? ఈ 5 అలానే ఉన్నాయిగా..!

Previous articleDhanush Sir movie review: ధనుష్ ”సార్” సినిమా హిట్టా..? ఫట్టా..?
Next articleటాలీవుడ్ లో త్రిపాత్రాభినయం చేసిన 9 మంది హీరోలు వీరే..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.