Ads
నందమూరి తారకరత్న మరణం సినీ పరిశ్రమని, నందమూరి ఫ్యామిలిని, అభిమానులను విషాదంలోకి నెట్టింది. హీరోగా, విలన్ గా నటించిన తారకరత్న పాలిటిక్స్ లోకి అడుగు పెట్టాలనుకున్నారు. ఈ సమయంలో ఊహించని విధంగా తారకరత్న గుండెపోటుతో కన్నుమూయడం ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యాన్స్ ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారు.
యువగళంలో పాల్గొన్న ఆయన జనవరి 27న గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేరిన తారకరత్న 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి కన్నుమూసిన విషయం తెలిసిందే. తారకరత్న మరణం తరువాత ఆయన గురించిన చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే తారకరత్న సంబంధించిన ఒక రెస్టారెంట్ కూల్చివేశారనే విషయం తాజాగా బయటకు వచ్చింది. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం..
కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ‘ఒకటో నెంబర్ కుర్రాడు’చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి నందమూరి తారకరత్న ఘనంగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకి సంగీతం ఎమ్ఎమ్ కీరవాణి అందించారు. ఈ చిత్రం మ్యూజికల్ గా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ మూవీ తరువాత తారకరత్న హీరోగా విజయాలు చూడలేదు. దాంతో విలన్ గా నటించి ఆడియెన్స్ ని అలరించారు. రవిబాబు డైరెక్షన్ లో వచ్చిన అమరావతి చిత్రంలో విలన్ పాత్రకు ఆయన నంది అవార్డును అందుకున్నారు. హీరోగా, విలన్ గా దాదాపు 23 సినిమాలలో నటించారు. ప్రస్తుతం ఆయన నటించే రెండు సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.
నందమూరి తారకరత్న పేరెంట్స్ కి ఇష్టం లేకుండా వివాహం చేసుకోవడంతో వారితో దూరం పెరిగింది. ఆయన తన కుటుంబంతో కలవడానికి 4 ఏళ్లు పట్టిందట. సినిమాలలో అంతగా రాణించకపోయినా తారకరత్నకు పలు బిజినెస్ లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గతంలో తారకరత్న సంబంధించిన ఒక రెస్టారెంట్ కూల్చివేశారనే విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. తారకరత్నకు హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో కబరా డ్రైవ్ ఇన్ అనే రెస్టారెంట్ ఉండేది. అయితే ఆ రెస్టారెంట్ ను జీహెచ్ఎంసీ ఆఫీసర్స్ 2019లో కూల్చడానికి సిద్ధమయ్యారు.
Ads
రెస్టారెంట్ సిబ్బంది అడ్డుకున్నా కొంత భాగాన్ని కూల్చారట. అప్పుడు తారకరత్న వెళ్లి జీహెచ్ఎంసీ ఆఫీసర్స్ ని ఎందుకు కూల్చారని ఆడగడంతో, రూల్స్ కు వ్యతిరేకంగా రెసిడెన్షియల్ ప్రాంతంలో బిజినెస్ నిర్వహిస్తున్నారని అక్కడి వారు కంప్లైంట్ చేశారని అధికారులు చెప్పారని తెలుస్తోంది. అంతే కాకుండా రెస్టారెంట్ లో మద్యాన్ని సప్లయ్ చేస్తున్నారని, న్యూసెన్స్ చేస్తున్నారని కూడా కొంతమంది ఫిర్యాదు చేశారని చెప్పినట్లు సమాచారం. దాంతో తారకరత్న వారితో చర్చించి రెస్టారెంట్ ని వేరొక చోటుకి మార్చడం కోసం టైమ్ తీసుకున్నారట. చెప్పినట్టుగానే ఆ రెస్టారెంట్ వేరే దగ్గరికి మార్చారట.
Also Read: పునీత్ రాజ్ కుమార్ టూ తారకరత్న.. ఇటీవల కాలంలో గుండెపోటుతో కన్నుమూసిన 7గురు సెలెబ్రిటీలు..