Ads
ప్రస్తుత కాలంలో దాదాపుగా అందరు స్మార్ట్ ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ అనేది జీవితంలో ఒక భాగంగా మారింది. స్మార్ట్ ఫోన్ విడిచి ఉండలేని స్థితి. కొంత మంది బాత్రూమ్ కు కూడా స్మార్ట్ ఫోన్ని తీసుకువెళ్తున్నారు. అయితే అలా తీసుకువెళ్లడం వల్ల అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..
Ads
స్మార్ట్ ఫోన్ ను బాత్రూమ్ కి తీసుకెళ్లడం పైల్స్ కి దారి తీస్తుంది. ఇప్పుడు యువతలో పైల్స్ ఎక్కువగా వస్తోంది. అయితే స్మార్ట్ ఫోన్ వల్ల పైల్స్ ఎందుకు వస్తుందంటే ఫోన్ ని వాడుతున్నప్పుడు సాధారణ సమయం కంటే ఎక్కువ సమయం బాత్రూమ్ లోనే కూర్చుంటారు. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల వస్తుంది. దాని వల్ల కండరాల పై ఒత్తిడిని పెంచుతుంది.అలా ఎక్కువ సమయం కూర్చుని ఉండడం వల్ల పాయువు మరియు పురీషనాళం కండరాల నరాల పై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఇది పైల్స్ రావడానికి ఒక కారణం. అలాగే బాత్రూమ్ కు ఫోన్ తీసుకెళ్లడం వల్ల అందులో ఉండే సూక్ష్మ జీవులు ఆ ఫోన్ కి అంటుకుంటాయి. మనం చేతులు శుభ్రం చేసుకున్నప్పటికి ఫోన్ ని కడగడ లేము కాబట్టి దానికి అంటుకున్న సూక్ష్మ జీవులు ఇన్ఫెక్షన్ల బారిన పడేస్తాయి. అందువల్ల స్మార్ట్ ఫోన్ ని టాయిలెట్ లో వాడకుండా ఉంటేనే మంచిది. లేదంటే చాలా అనారోగ్య సమస్యల బారిన పడే ఛాన్స్ ఉంది.
ఇక స్మార్ట్ ఫోన్‌ను, టాయిలెట్‌ను పోల్చి చూసినపుడు బాత్రూమ్ లో కంటే స్మార్ట్ ఫోన్ డిస్ప్లే పైనే అదిక ప్రమాదం కలిగించే సూక్ష్మ జీవులు ఉంటాయట. అంతేకాకుండా మానసిక ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపుతుందని తెలిస్తోంది. జీవితంలో ఎన్నో పనులను సులువు చేస్తున్న స్మార్ట్ ఫోన్ బాత్రూమ్ లో వాడడం వల్ల మనకు తెలికుండానే మానసిక, శారీరక అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నాం.Also Read: ఐరన్ లోపమా..? ఇలా ఈజీగా గుర్తించి.. ఈ ఆహారాన్ని తీసుకుంటే సరి..!