ఐరన్ లోపమా..? ఇలా ఈజీగా గుర్తించి.. ఈ ఆహారాన్ని తీసుకుంటే సరి..!

Ads

ఈ మధ్యకాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. చాలామంది ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్యలలో ఐరన్ లోపం కూడా ఒకటి. ఐరన్ తగ్గుతోందని ఎలా గుర్తుపట్టొచ్చు..? ఐరన్ పెరగాలంటే ఏం తినాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన జనాభాలో 30 శాతానికి పైగా రక్తహీనతతో బాధపడుతున్నారు.

ఎర్ర రక్త కణాల్లో ఖనిజాల లోపం వలన ఐరన్ డెఫిషియన్సీ సమస్య కలుగుతుంది. ఈ సమస్య చాలా కామన్ గా వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఈ ఇబ్బంది ఉంటే సొంతంగా చికిత్స చేయకూడదు ఎక్కువ ఐరన్ వలన లివర్ పాడవుతుంది. అలానే ఇతర సమస్యలు కూడా కలగొచ్చు.

ఐరన్ లోపం ఉంటే ఈ లక్షణాలు కనబడతాయి..

  • చర్మం పాలిపోవడం
  • గుండె వేగంగా కొట్టుకోవడం
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడం
  • అలసట
  • బలహీనంగా ఉండడం

ఈ లక్షణాలు కూడా ఉండొచ్చు:

  • నాలుక మీద వాపు లేదా నొప్పి కలగడం
  • తలనొప్పి, తల తిరగడం
  • జుట్టు రాలిపోవడం
  • గోళ్లు పెళుసుగా మారడం
  • అదేపనిగా కాళ్ళని కదిలించడం

Ads

ఐరన్ మనకి ఎలా అందుతుంది..?

  1. రెండు రకాలుగా మనకి ఐరన్ అందుతుంది. ఒకటి హీమ్. రెండవది నాన్ హీమ్. జంతు సంబంధిత వనరులని తీసుకుంటే ఐరన్ మనకి వస్తుంది.
  2. గుడ్లు, చేపలు, లివర్, మేక, గొర్రె, పంది మాంసం. అలానే ఐరన్ మనకి ఆకుకూరల ద్వారా కూడా వస్తుంది.
  3. బ్రెడ్స్ ధాన్యాలు తో ఉండే అల్పాహారం తీసుకుంటే కూడా ఐరన్ ని పొందొచ్చు. అలానే మీరు అల్పాహారం తీసుకునేటప్పుడు అల్పాహారంతో పాటుగా నారింజ లేదా నారింజ జ్యూస్ తీసుకుంటే కూడా ఐరన్ అందుతుంది.
  4. మీరు అల్పాహారంతో పాటు కాఫీ ని తీసుకుంటే తక్కువ మోతాదులోనే ఐరన్ అందుతుంది. కనుక ఆ తప్పు చెయ్యద్దు.
  5. క్యాబేజీ లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా పచ్చి క్యాబేజీలో ఐరన్ బాగా ఉంటుంది. కాబట్టి మీరు పచ్చి క్యాబేజీ తీసుకోవచ్చు. కానీ ఉడికిస్తే అందులో ఉండే ఐరన్ తగ్గిపోతుంది.
  6. బ్రోకలీ, కాలీఫ్లవర్, కాలే వంటి వాటిల్లో కూడా ఐరన్ ఉంటుంది వీటిని కూడా మీరు తీసుకోవచ్చు.
  7. పచ్చి పాలకూరలో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది.
Previous articleబీసీసీఐ ఎందుకు ”లతా మంగేష్కర్‌” కి.. ఎప్పుడూ రెండు వీఐపీ టిక్కెట్లను ఉంచేది..!
Next articleజగ్గు భాయ్ ఇక పై తాత కాలేడు.. పెద్ద కుమార్తె అలా.. చిన్న కూతురు ఇలా…