Ads
చాలామంది శివుడిని ఆరాధిస్తూ ఉంటారు. శివాలయానికి వెళ్లి పూజలు కూడా చేస్తూ ఉంటారు. అలానే శివుడికి పూజలు చేసి ప్రదక్షిణాలు కూడా చేస్తూ ఉంటారు. ఇంట్లో కూడా చాలా మంది శివుడికి పూజలు చేస్తూ ఉంటారు. సోమవారం నాడు శివుడిని ప్రత్యేకంగా కొలిచి కోరికలని శివుడికి చెబుతూ ఉంటారు. అయితే ఆలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా ప్రదక్షిణాలు తప్పక చేస్తారు.
ఎవరికి నచ్చినన్ని సార్లు ప్రదక్షిణాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. కొందరు మూడుసార్లు ప్రదక్షిణాలను చేస్తూ ఉంటే కొందరు ఐదు సార్లు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు.
శివాలయంలో మాత్రం ప్రదక్షిణాలు చేసే విధానం వేరుగా ఉంటుంది. మరి ఎలా శివాలయంలో ప్రదక్షిణాలని చేయాలి అనేది చూద్దాం. గర్భగుడిలో శివుడికి ఎదురుగా నంది ఉంటుంది. అభిషేకం ఏదైనా చేస్తే అదంతా కూడా శివుడు పైకి వెళుతుంది. శివుడు మీద పడ్డ నీరు, పంచామృతాలు అన్నీ కూడా లింగమాకారం ద్వారా కిందకి ప్రవహిస్తుంది. అయితే దాన్ని చండీశ్వరుడు స్థానం అని అంటారు. శివాలయంలోకి వెళ్ళాక శివుడి గర్భ గుడి చుట్టూ పూర్తి ప్రదక్షిణాలు చేయకూడదు. ప్రదక్షిణాలు చేసినప్పుడు మొదట నంది నుండి మొదలు పెట్టాలి.
Ads
ఆ తర్వాత చండీశ్వరుడు స్థానం వద్దకు వెళ్లి దర్శించుకుని తర్వాత మళ్లీ వెనక్కి రావాలి. ఆ తర్వాత ఇక్కడ ఉన్న చిత్రంలో ఉన్నట్లు ప్రదక్షిణం చేయాలి. అంటే మొదట ఒకసారి చండీశ్వరుడు స్థానం వద్దకు వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చి నందీశ్వరుడు దగ్గర ఆగి అక్కడి నుండి గర్భగుడి మీదుగా లింగాన్ని అభిషేకించే నీటి వద్దకు చేరుకోవాలి. తర్వాత మళ్ళీ వెనక్కి రావాలి తిరిగి నంది దగ్గరకి మీరు వచ్చేసే ప్రదక్షిణాన్ని పూర్తి చేయాలి. ఇక్కడ మీరు వెనక్కి తిరిగి గర్భగుడిగా మీదుగా వెళ్లి చండీశ్వరుడి స్థానం కి వెళ్ళాక మళ్ళీ వెనక్కి వచ్చేయాలి. ఇలా కనుక మీరు మూడు సార్లు ప్రదక్షిణం చేసారంటే అది 10వేల సార్లు ప్రదక్షిణం చేయడం తో సమానం.