Ads
సీనియర్ హీరో సుమన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన ఎలాంటి పాత్రలో అయిన ఒదిగిపోయే నటుడు. అప్పట్లో సుమన్ మూవీ వస్తుందంటే థియేటర్లలో ఆడియెన్స్ హడావిడి మామూలుగా ఉండేది కాదు. మాస్ క్యారెక్టర్ లో ఫైట్ చేయడం దగ్గర నుండి వేంకటేశ్వర స్వామి వరకు ఆయన నటించిన పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయాడు.
హీరో సుమన్ సొంతూరు మంగులూరు. ఆయన మాతృ భాష తుళు. ఆయన తుళు, తమిళం,ఇంగ్లీషు, కన్నడ, మలయాళం లాంటి భాషలు స్పష్టంగా మాట్లాడగలడు. కరాటేలో బ్లాక్ బెల్ట్. సుమన్ ముందుగా కరాటే మాస్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టాడు. సుమన్ ని అతని సన్నిహితుడు ఒకరు దర్శకుడు కె.రామన్నకి పరిచయం చేయడంతో సుమన్ ఆయనకు తన కరాటే ప్రతిభని ప్రదర్శించి, మెప్పించారు. అలా ఆయన మొదటి సినిమా అవకాశం వచ్చింది. మొదట్లో షూటింగ్ లో ఆయన చాలా ఇబ్బందిగా ఫిల్ అయ్యడంట. అయితే డైరెక్టర్ సుమన్ కి ఫ్రీడమ్ ఇవ్వడంతో ఆయన షూటింగ్ వాతావరణానికి అలవాటు పడ్డారు. తొలి సినిమా రిలీజ్ అవకముందే సుమన్ కి 2 చిత్రాలలో అవకాశాలు వచ్చాయి. కోలీవుడ్ లో నేచకులం మూవీ 1979లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది. అలా ఆయన మూడేళ్లలోనే కోలీవుడ్ లో స్టార్ హీరోగా మారాడు.
సుమన్ తమిళ చిత్రాలు చూసిన డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ ఆయనతో తెలుగులో ఒక మూవీ చేయాలనుకున్నాడు. అలా ఇద్దరు కిలాడీలు చేశారు.అయితే సుమన్ నటించి తెలుగులో రిలీజ్ అయిన తొలి సినిమా తరంగిణి. అలా ఆయన తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారారు. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి ఒక వైపు డ్యాన్స్ తో దూసుకెళ్తుంటే, సుమన్ ఫైట్స్ తో ఆడియెన్స్ ని అలరించే వారు. ఇక వీరిద్దరు పోటాపోటీగా చిత్రాలు చేసేవారు. ఇక పారితోషికం విషయంలో కూడా ఇద్దరి మధ్య బాగా పోటీ ఉండేది. ప్రతీ పండుగకు కూడా సుమన్ సినిమాలు విడుదల అయ్యేవి. 1984 నుండి సుమన్ తెలుగులోనే బిజీగా ఉండేవారు. 1985లో అయితే ఏకంగా 10 తెలుగు సినిమాల వరకు రిలీజ్ అయ్యాయి. అలా సుమన్ తెలుగు ఆడియెన్స్ మనసుల్లో స్థానం సంపాదించుకున్నాడు. అయితే 1985లో సుమన్ కెరీర్ ను మలుపు తిప్పే ఊహించని సంఘటన జరిగింది. మే 18న 1985లో అర్థరాత్రి పోలీసులు సుమన్ ఇంటికి వచ్చి మీ ఇంట్లో వెతకడం మొదలు పెట్టారు. ఎందుకు అని అడిగితే ంఈ ఇంట్లో బాంబ్ పెట్టారని తెలిసిందని, వెతకడం అయిన తరువాత హీరో సుమన్ ని పోలీస్ స్టేషన్ కి ఒకసారి వచ్చి, వెళ్ళమని చెప్పి తీసుకెళ్లారు. తీరా అక్కడికి వెళ్ళిన తరువాత సుమన్ ఫ్రెండ్ దివాకర్ అశ్లీల చిత్రాలు తీస్తున్నాడని, దానిలో సుమన్ హస్తము ఉన్నట్టుగా తెలిపారు. అంతేకాకుండా సుమన్ కారుని కూడా అందులో వాడారని, దాంతో సుమన్ ని అరెస్ట్ చేశామని, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశామని వెల్లడించారు. సుమన్ ని తీసుకెళ్ళి రౌడీలు ఉన్న సెల్ లో ఉంచారు.
అలా ఆయన జైలుకు వెళ్లిన అనంతరం రిలీజ్ అయిన తొలి మూవీ కంచుకవచం ఘన విజయం సాధించడంతో ఆడియెన్స్ లో సుమన్ క్రేజ్ పోలేదని నిరూపించింది. ఈ మూవీ హిట్ అవడంతో మధ్యలోనే ఆగిన సుమన్ చిత్రాల వారు షూటింగ్ చేయడం కోసం కోర్టులో పర్మిషన్ తీసుకున్నారు. దాంతో కోర్టు షూటింగ్ ఏదైనా చెన్నైలోనే చేయాలని షరతు పెట్టింది. దానివల్ల సుమన్ కి మెల్ల మెల్లగా సినిమాలు తగ్గిపోయాయి. సుమన్ జైలు నుండి బయటకు వచ్చిన అనంతరం సినిమాలలో ఛాన్స్ లు రాకపోవడంతో ఇండస్ట్రీలో పరువు, మర్యాదలు కోల్పోయారు. అయితే ఆ సమయంలో రచయిత టి.వీ. నరసరాజు తన మనవరాలు శిరీషను సుమన్ కి ఇచ్చి వివాహం జరిపించడం సినివర్గాలకు చెందినవారు ఆలోచనలో పడ్డారు.అప్పటి నుండి ఆయనకు చిన్న చిన్న క్యారెక్టర్స్ రావడంతో ఆయన నటించడం మొదలు పెట్టారు. అలా ఆయన చేసిన అన్నమయ్య, శ్రీరామదాస్ చిత్రాల్లో సుమన్ అద్భుతమైన నటనకు అందరి మన్ననలు పొందారు.
Ads
ఇక సుమన్ జైలుకి వెళ్ళడానికి కారణం అయిన అతన స్నేహితుడు పేరు దివాకర్. ఆయనకి క్యాసెట్ రెంట్ కి ఇచ్చే షాపు ఉంది. సుమన్ ఆయన దగ్గర నుండి అప్పుడప్పుడు మూవీ తీసుకునేవారట. సుమన్ తన కారును ఫ్రెండ్ దివాకర్ కి ఇస్తే, అతను ఆ కారుని అశ్లీల ఫిలింలో వాడారట. కారు ఇవ్వడం అనే చిన్న విషయనికి సుమన్ కెరీర్ తలక్రిందులు అయ్యింది. సుమన్ మీద ఎక్కడ చూసిన నెగిటివ్ ప్రచారం ఎక్కువైంది. ఆ కష్ట సమయంలో ఆయనకి ఫ్యాన్స్, తల్లిదండ్రులు పూర్తిగా మద్దతు ఇచ్చారు. అయితే ఇండస్ట్రీలో సుమన్ ని ఎదగకుండా చేయడానికే ఇలా చేశారని, ఒక టైమ్ లో చిరంజీవి పేరు కూడా వినిపించింది.
అయితే చాలా సార్లు సుమన్ఈ విషయాన్ని ఖండించారు. అయితే సుమన్ ఇరుక్కున్నారో కావాలనే చేసిన కుట్రకు బలి అయ్యారో కానీ, ఆయన జైలుకు వెళ్లడం వల్ల అగ్ర హీరోగా ఉండవలసిన సుమన్ చిన్న చిన్న క్యారెక్టర్స్ కి పరిమితమయ్యారు. ఈ మధ్య కాలంలో సుమన్ ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చారు. నా కెరీర్ మంచి దశలో ఉన్నప్పుడు ఊహించని విధంగా నా పై కేసులు పెట్టడంతో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. దీనికి కారణం నా స్నేహితుడు దివాకర్. ఆ పేరుని అప్పట్లోనే కోలీవుడ్ మీడియాకి చెప్పాను. ఇక అతనికి ఇండస్ట్రీకి సంబంధం ఏం లేదు. అలాగే అతనికి సినిమా వాళ్లతో ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు.
Also Read: బాలయ్య చెప్పిన ”కత్తితో కాదురా, కంటి చూపుతో చంపేస్తా” అనే డైలాగ్ ను ఎవరి దగ్గర నుండి కాపీ చేశారంటే..