రోబో సినిమాలో మొదట విలన్ అనుకొన్న రజిని కాంత్ హీరోగా మారడం వెనుక ఉన్న కథ..

Ads

డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ఇండియాలోనే టాప్ డైరెక్టర్లలో ఒకరు. భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించడంలో ఆయనే నెంబర్ వన్ అని చెప్పవచ్చు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలలో రోబో సినిమా సంచలనం సృష్టించింది.

అయితే ఈ హిట్ మూవీలో ముందుగా అనుకున్న హీరో రజనీకాంత్ కాదంట. మరి ఆ హీరో ఎవరో, ఎందుకు రోబో మూవీలో నటించలేదో, ఆ స్థానంలోకి సూపర్ స్టార్ రజిని కాంత్ ఎలా వచ్చారో ఇప్పుడు చూద్దాం. శంకర్ దర్శకత్వంలో అర్జున్ హీరోగా వచ్చిన ఒకే ఒక్కడు సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. దాంతో శంకర్ ఈ సినిమాకి రీమేక్ గా హిందీలో అనిల్ కపూర్ తో నాయక్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఆ మూవీ నిరాశ పరిచింది. ఈ మూవీ తర్వాత శంకర్ రోబో స్టోరిని అనుకున్నారు.
అయితే కోట్ల బడ్జెట్ తో నిర్మించాల్సిన సినిమా అవడంతో  ఈ మూవీని ముందుగా కమలహాసన్, ప్రీతిజింతాతో ఫోటోషూట్ చేశారు. ఈ మూవీ నిర్మాణానికి మీడియా డ్రీమ్స్ సంస్థ ముందుకు వచ్చింది. అయితే స్టోరి విషయంలో శంకర్, కమలహాసన్ కి భేదభిప్రాయాలు వచ్చాయి.

Ads

దీంతో శంకర్ ఈ మూవీని  పక్కకు పెట్టి, బాయ్స్ మూవీని తీశాడు. ఈ చిత్రం హిట్ అయ్యింది. దాంతో  రోబోను మొదలు పెట్టాలని అనుకున్నాడు. ఈ సినిమా స్టోరిని షారుక్ ఖాన్ కి చెప్పారు. స్టోరీ విన్న షారుఖ్ ఖాన్ వెంటనే ఒప్పుకుని,  తానే ఈ చిత్రాన్ని నిర్మిస్తానని కూడా చెప్పారు.ఈ మూవీలో కరీనా కపూర్ ని హీరోయిన్ గా అనుకున్నారు. ఇంతలోనే  స్టోరి విషయంలో ఇద్దరి మధ్య భేదభిప్రాయాలు రావడంతో ఈ మూవీ మళ్లీ ఆగిపోయింది. అనంతరం అమీర్ ఖాన్, అజిత్ వద్దకు కూడా ఈ కథ వెళ్ళింది. అయితే వారితో మూవీ సెట్ అవలేదు. అలా చివరికి రజనీకాంత్ దగ్గరకు వెళ్ళింది. అయితే శంకర్ ఈ మూవీలో రజినీకాంత్ ని విలన్ గా అనుకున్నాడు. హీరో షారుక్ అని భావించాడు. అయితే స్టోరీ విషయంలో షారుక్ ఒప్పుకోలేదు. దాంతో శంకర్ రజనీకాంత్ తోనే విలన్ చిట్టి క్యారెక్టర్ మరియు హీరోగా కూడా చేయించారు. ఇక ఈ మూవీ సరికొత్తగా కథతో ఆడియెన్స్ ని ఆకట్టుకొని ఘన విజయం సాధించింది.
Also Read: లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఖైదీ, మాస్టర్, విక్ర‌మ్ సినిమాలలో ఉన్న కామ‌న్ పాయింట్ ను గ‌మ‌నించారా?

Previous articleహీరో సుమన్ కెరీర్ ను నాశనం చేయాలనుకున్న మిత్రుడు ఎవరో తెలుసా?
Next articleమెగాస్టార్ చిరంజీవిని శ్రీదేవి నిజంగా అవమానించిందా..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.