Ads
కేరళలో శబరిమల అయ్యప్ప దేవాలయం ప్రసిద్ధ చెందిన పుణ్యక్షేత్రం. ఇక్కడికి లక్షలాది భక్తులు వచ్చి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని జన్మ తరించేలా చేసుకుంటారు. ప్రతి ఏడాదికి శబరిమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
Ads
నవంబర్, డిసెంబర్, జనవరి నెలలలో తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా దక్షణాది రాష్ట్రాలలో ఎక్కడ చూసినా అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో కనిపిస్తూ ఉంటారు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో లక్షల్లో అయ్యప్ప భక్తులు ఉంటారు. మూడు నెలల పాటు పూజలు, భక్తి గీతాలు, అన్న దానాలు, ప్రతి గల్లీలోనూ కనిపిస్తూంటాయి. అయ్యప్ప స్వామికి ఎక్కువగా ఈ 3 నెలలు మాల వేసుకుని, ఇరుముడి కట్టి, అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు.
అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి కొండ మార్గంలో సుమారు ఐదు వేల అడుగుల ఎత్తు ఉన్న కొండను ఎక్కాలి. ఆ కొండను పైకి వెళ్ళిన తర్వాత అయ్యప్ప ఆలయం ముందు ఉన్న బంగారు మెట్లను ఎక్కి, ఆ మెట్లను మొక్కుతూ వెళ్ళి అయ్యప్పను దర్శించుకుంటారు. మండల కాలం(40 రోజులు) దీక్ష చేసి, అయ్యప్ప స్వామి గుడిలోని బంగారు మెట్లు ఎక్కి, అయ్యప్పను దర్శించుకుంటే మోక్షం వస్తుందని విశ్వసిస్తారు. అయితే అయ్యప్ప గుడిలో ఉండే 18 బంగారు మెట్లకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మెట్లకు ఉండే ప్రాముఖ్యత వల్ల మెట్లు ఎక్కేవారిలో ఉండే చెడు లక్షణాలు అన్ని నశిస్తాయి. 18 మెట్లు ఎక్కి, అయ్యప్ప స్వామిని దర్శించుకున్న వారి జీవితం దన్యం అవుతుంది.
పరశురాముడు శబరిమలలోని 18 మెట్లను కట్టించాడు. పరశురాముడు పంచ భూతాలను మాత్రమే కాక మానవుడు వేటి కారణంగా ఇబ్బంది పడుతున్నాడో అలాంటి వాటినే మెట్లుగా మలిచాడని అంటారు. ఈ 18 మెట్లను జీవితంలో ఒక్కసారి ఎక్కినా జీవితకాల ఫలం దక్కుతుందని భక్తుల నమ్మకం. ఇక 18 మెట్లలో తొలి 8 మెట్లు అష్ట దిక్పాలకులు అనగా ఇంద్రుడు, యముడు, అగ్ని, నైరూతి, వాయువు, వరుణుడు, కుబేరుడు, ఈశాన్యుడు. తొమ్మిది మరియు పది మెట్లు కర్మ యోగం, జ్ఞాన యోగం.
మిగిలిన మెట్లు విద్య, జ్ఞానం, అవిధ్య, అజ్ఞానం, ధుఖం, ఆనందం, మోక్షం, మనశాంతి. ఈ 18 మెట్లను దాటి వెళ్లడంతో వారి జీవితం సంతోషమయం అవుతుంది.భక్తులు నెయ్యి, కొబ్బరికాయలు నెత్తిన పెట్టుకుని ఈ 18 మెట్లను ఎక్కి, ఆ నెయ్యితో అయ్యప్పకు అభిషేకం చేయడంతో సర్వం సిద్దిస్తుందని నమ్ముతారు.
Also Read: శుక్రవారం సాయంత్రం ఈ నియమాలు పాటించడం వల్ల అంతా శుభమే..!