Ads
సాధారణంగా ప్రతి శుభ కార్యంలో మొదట వినాయకుడిని పూజిస్తారు. ముందుగా వినాయకుడిని పూజించడం వల్ల ఆ కార్యంలో విజయం వస్తుందని విశ్వసిస్తారు. గణేషుడికి మోదకంతో పాటుగా చాలా రకాల పండ్లను కూడా నైవేద్యంగా పెడుతారు. అయితే భోపాల్‌కు చెందిన జ్యోతిష్య శాస్త్ర నిపుణుడు అయిన హితేంద్ర శర్మ గణేశుడిని అనుగ్రహం పొందడానికి ఈ 5 పండ్లను నైవేద్యంగా పెట్టాలని తెలిపారు.
Ads
వినాయకుడి పూజకు విశేష మహత్యం ఉంది. హిందువులు ఏ శుభకార్యం మొదలు పెట్టాలనుకున్న ముందుగా గణేశుడి పూజతోనే మొదలు పెడతారు. గణేశుడికి బుధవారం సమర్పితం. ఆ రోజున వీధి విధానాలతో గణేశుడిని పూజిస్తే జీవితంలోని కష్టాలన్ని తొలగిపోతాయిని చెబుతున్నారు. అందువల్ల ఈ 5 పండ్లను ఆ విఘ్నాధిపతికి నైవేద్యంగా సమర్పించి, ఆయన దీవెనలు పొందవచ్చు. మరి ఆ 5 పండ్లు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1. అరడిపండు:
అరటిపండ్లు అంటే వినాయకుడుకి ఎంతో ప్రీతికరం. ఆయన చాలా ఇష్టంగా ఈ పండును స్వీకరిస్తారు. వినాయకుడుకి అరటిపండును నైవేద్యంగా పెట్టి, ప్రసాదాన్ని సేవిస్తే దోషాలు, రోగాలు దూరమవుతాయి.
2. సీతాఫలం:
ఈ ఫలం శీతాకాలంలో మార్కెట్లోకి వస్తుంది. చాలా రుచిగా ఉండే సీతాఫలం అంటే గణపతికి చాలా ఇష్టం. సీతాఫలంను పోషకాల నిధి అని అంటుంటారు. ఈ ఫలాన్ని గణపతికి నైవేద్యంగా పెట్టినట్లయితే వినాయకుడు చాలా ఆనందిస్తాడు. ధన్యప్రాప్తి కలుగుతుంది.
3. బేల్ పండు:
ఈ పండు అంటే శివుడు మరియు గణపతికి చాలా ప్రియమైనది. వినాయకుడికి సమర్పించడం వల్ల ఇద్దరి ఆశీస్సులు కలుగుతాయి. దాంతో చేపట్టిన కార్యాలన్నీ సఫలం అవుతాయి.
4. నేరేడు పండు:
ఇది వర్షాకాలంలో లభిస్తుంది. గణపతికి నేరేడు పండు కూడా ఇష్టమైన ఫలం. విశ్వాసుల ప్రకారం అయితే సిద్ధి వినాయకుడి అనుగ్రహం పొందడానికి బుధవారం నాడు సాయంత్రం గణపతికి నేరేడు పండును పెట్టి, తరువాతి రోజు ఆ పండును కుటుంబ సభ్యులకు ప్రసాదంగా పంచాలి.
5. జామ పండు:
వినాయకుడుకి అత్యంత ప్రీతికరమైన ఫలం జామ అని చాలా మందికి తెలియదు. కొద్దిమందికి మాత్రమే తెలుసు. వినాయకుడి అనుగ్రహంతో మీ కోరికలు నెరవేరినప్పుడు జామ పండు వినాయకుడుకి సమర్పించవచ్చు.
Also Read: పారిజాత పుష్పాలను పొరపాటున కూడా వేరేవారి దగ్గర నుండి తీసుకోని పూజ చేయకూడదు.. ఎందుకో తెలుసా?