ఎన్టీ రామారావు తన కొడుకులకి ఆస్తి ఎంత ఇచ్చారో తెలుసా?

Ads

లక్ష్మీపార్వతి అంటే ఎక్కువగా గుర్తు పట్టరేమో కానీ, ఎన్టీ రామారావు రెండో భార్య అని చెప్తే వెంటనే గుర్తుకు వస్తుంది. ఎన్టీ రామారావుకి ఎంత పాపులారిటీ, క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. ఆయనను పెళ్లి చేసుకోవడం వల్ల లక్ష్మీపార్వతికి కూడా అంతే గుర్తింపు వచ్చింది.

Ads

కాగా ఎన్టీ రామారావు కెరీర్ మొదట్లో ఉన్నప్పుడు ఒక హీరోయిన్ ని రెండవ వివాహం చేసుకునే సమయంలో ఆయన తమ్ముడు త్రివిక్రమరావు ఆ వివాహాన్ని ఆపేసాడు. అయితే ఆ హీరోయిన్ ను ఎన్టీ రామారావు పెళ్లి చేసుకోకుండా అప్పుడు ఆపగలిగాడు. కానీ ఎన్టీ రామారావు రెండవ వివాహాం చేసుకోవడం ఆపలేక పోయారు. ఇక ఎన్టీ రామారావు రెండవ భార్యగా అందరికి సుపరిచితం అయిన లక్ష్మి పార్వతి ఆయన మరణం తరువాత లక్ష్మీపార్వతికి నందమూరి కుటుంబానికి మధ్య దూరం ఏర్పడింది.
అయితే వైసీపీ ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఆమె మీడియా ముందుకి వస్తూ, తరచూ ఎన్టీఆర్ ఫ్యామిలీ పై విమర్శలు చేస్తుంటారు. ముఖ్యంగా అయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి ఛాన్స్ దొరికినపుడల్లా వెన్నుపోటు అని ఉపన్యాసాలు ఇస్తునే ఉంటారు. ఈ క్రమంలోనే లక్ష్మిపార్వతి ఒక ఇంటర్వూలో ఎన్టీ రామారావు గారు తన కొడుకులకు ఎలా ఆస్తి ఇచ్చారనే విషయాన్నీ తెలిపారు.
ఎన్టీ రామారావు గారు పాలిటిక్స్ లో రావాలని నిర్ణయించుకున్నప్పుడే కొడుకులందరికి ఆస్తులను సమానంగా ఇచ్చారు. ఆయన తనతో ఏ ఆస్తిని పెట్టుకోలేదు అంటూ లక్ష్మి పార్వతి తెలిపారు. ఎన్టీ రామారావు గారు కొడుకులకు ఇల్లు కట్టించి మరి ఇచ్చారని, ఆస్తులను కూడా సమానంగా ఇచ్చిన తరువాతనే రాజకీయాల్లోకి వచ్చారని వెల్లడించారు.
ఆస్తుల కోసం, పదవుల కోసమే ఎన్టీ రామారావు గారిని పెళ్లి చేసుకున్నట్లు నా మీద నిందలు వేశారు. అయితే నేను ఆయన జీవితంలోకి వచ్చే సమయానికి రామారావు వద్ధ ఏ ఆస్తులు లేవు. పదవుల మీద  నాకు ఇష్టం ఉంటే, ఎప్పుడో పదవులను తీసుకునేదాన్ని. రామారావు గారు ఎన్నో సార్లు అడిగినా, నేనే  వాటిని వద్దని చెప్పానని వివరించారు.

Also Read: నందమూరి తారకరత్న చివరి కోరిక తీర్చేందుకు సిద్ధపడుతున్న భార్య అలేఖ్య రెడ్డి..

Previous articleచిరంజీవి ఫ్యామిలీని తిట్టడం వల్ల టాలీవుడ్ లో అవకాశాలు కోల్పోయిన వారు ఎవరో తెలుసా?
Next articleడైరెక్టర్ శంకర్ రజినీ కాంత్ ‘శివాజీ’ మూవీలో ఈ చిన్న మిస్టేక్ ఎలా చేశాడబ్బా!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.