సూపర్ స్టార్ రజినీ కాంత్‌ భార్య లత ఆయనను ఎందుకు ఇష్టపడ్డారో తెలుసా?

Ads

ప్రస్తుతం సెలబ్రిటీలకు సంబంధించిన చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారుతోంది. కానీ, అప్పట్లో ఇంతగా మీడియా, సామాజిక మాధ్యమాలు, ఎప్పటికప్పుడు అప్ డేట్స్ లాంటి హంగామా ఉండేది కాదు. ప్రముఖుల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు అప్పట్లో వారు ఇచ్చిన ఇంటర్వూల్లో తమ గురించి తాము చెప్తే తప్ప ఎవరికి తెలిసేది కాదు.

Ads

ప్రస్తుతం వారి జీవితం తెరిచిన పుస్తకమే. అంతా గాసిప్స్, రూమర్లే. అయితే స్టార్ల నిజ జీవితాల గురించి ఎప్పుడు తెలిసినా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. సూపర్ స్టార్ రజినీ కాంత్, ఆయన సతీమణి లతల ప్రేమ కథ గురించి అప్పట్లో వచ్చిన వచ్చిన ఆర్టికల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో షికారు చేస్తోంది.  పెళ్లి జరగక ముందు రజినీ కాంత్ చాలా టెంపర్ ఉండేదంట. ఏ విషయంలో అయినా  ముక్కుసూటిగా ఉండేవారట. ఇక అన్యాయాన్ని అయితే అసలు భరించక పోయేవారంట. అందువల్లనే ఏమో అప్పట్లో రజినీ కాంత్ ను యాంగ్రీ యంగ్ మెన్ అని పిలిచేవారంట.
రజినీ కాంత్ కి సహ నటుడు అయిన వై.జి. మహేంద్రన్ చాలా మంచి మిత్రుడు. ఈయనని మాత్రమే రజినీ కాంత్ కి ఫ్రెండ్ అని అంటుంటారు. రజినీ తరుచూ మహేంద్రన్ ఇంటికి వెళ్ళేవారంట. ఆ సమయంలోనే మహేంద్రన్ చెల్లెలు అయిన లత, రజినీ కాంత్ ని ఇష్టపడ్డారు. ఆమెకు రజినీ కాంత్ మాన్లీనెస్, వ్యక్తిత్వం నచ్చడంతో వీరిద్దరు ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. ఇక వివాహం తర్వాత లత, రజినీ కాంత్ లోని కోపాన్ని పూర్తిగా తగ్గేలా చేసి, రజినీ కాంత్ ను పూర్తిగా మర్చినట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో  చెప్తుంటారు.
భార్య లత ప్రభావం వల్లనేమో కానీ వివాహం తరువాత రజినీ కాంత్ రాఘవేంద్ర స్వామికి భక్తుడు  అయ్యారు. భార్య లత ప్రభావం రజినీ కాంత్ పై చాలా ఉందని అంటుంటారు. అంతే కాకుండా కోలీవుడ్ లో రజినీ అగ్ర నటుడుగా ఎదగడానికి కూడా ఆయన భార్య లత కారణమని అంటారు. ఇన్నేళ్ల నుండి సూపర్ స్టార్ రజినీ కాంత్ పెళ్లి వెనుక ప్రేమకథ ఉందని చాలా మందికి తెలియదు.
Also Read: ప్రేమికుడు మూవీ షూటింగ్ ను మధ్యలోనే ఆపాలని గవర్నర్ ఎందుకు వార్నింగ్ ఇచ్చాడో తెలుసా?

Previous articleచిరంజీవి ఆ మూవీలో అలా చేయడం నచ్చలేదు.. దర్శకుడు రాజమౌళి కామెంట్స్
Next articleస్టార్ డైరెక్టర్ ను బిర్యానీ తీసుకు రమ్మని చెప్పిన జూనియర్ ఎన్టీఆర్..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.