Ads
వేసవి కాలంలో మండే ఎండల నుండి కాపాడుకుంటూ వేడి, డీహైడ్రేషన్ వంటి ఇబ్బందుల బారిన పడకుండా శరీరాన్ని రక్షించుకోవాల్సి ఉంటుంది. కొన్ని పానీయాలు సమ్మర్ లో ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్య పాత్రని పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Ads
ఈ పానీయాలు దాహాన్ని తీర్చడంతో పాటుగా వేడిని నియంత్రించి శరీరాన్ని చల్లబరుస్తాయి. అంతే కాకుండా వేసవిలో శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. మరి ఆ పానీయాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1.కొబ్బరి నీరు:
ఎండా కాలంలో తప్పకుండా తీసుకోవలసిన డ్రింక్ కొబ్బరి నీరు. ఇందులోని పోషకాలు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను ఇస్తాయి. సమ్మర్ లో ఉదయం పూట కొబ్బరినీళ్లు తాగడం ద్వారా రోజంతా శరీరం చల్లగా ఉంటుంది. మధ్యాహ్న పూట కొబ్బరినీరు తాగినట్లయితే శరీరానికి ఉల్లాసం కలుగుతుంది.
2.మజ్జిగ:
ఎండా కాలంలో మజ్జిగను తాగడం లేదా ఆహారంగా తప్పనిసరిగా తీసుకోవాలి. మజ్జిగ శరీరాన్ని చల్లబరచడంతో పాటుగా జీర్ణవ్యవస్థను మెరుగు అయ్యేలా చేస్తుంది. మలబద్దకాన్ని కూడా నివారిస్తుంది. భోజనం తర్వాత గ్లాసు మజ్జిగ తాగితే అన్ని కాలల్లోనూ శరీరానికి మంచిది.
3.చెరకు రసం:
చెరకు, అల్లం, నిమ్మకాయలను, పుదీనాతో చేసే పానీయం సహజమైన తీపిని కలిగి ఉంటుంది. ఈ పానీయంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ పానీయం వేసవి ఎండల నుంచి శరీరాన్ని కాపాడుతుంది. ఐస్ కలపకుండా తాగితే మంచిది.
4.పుచ్చకాయ జ్యూస్:
వేసవిలో పుచ్చకాయ జ్యూస్ దాహం తీర్చడంతో పాటుగా శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది.
5.జీలకర్ర నీరు:
వేసవిలో వేడి చేసి చల్లారిన నీటిలో నానబెట్టిన జీలకర్ర నీటిని లేదా జీలకర్ర వేసి మరిగించిన నీటిని తీసుకోవాలి. ఈ జీలకర్ర నీరు శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. అంతేకాకుండా జీర్ణ సమస్యలను కూడా పోగొడుతుంది.
6.మెంతి టీ:
మెంతితో చేసిన టీ తీసుకోవడం వల్ల శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడంతో పాటుగా శరీరం నుంచి టాక్సిక్ పదార్దాలను బయటకు పంపిస్తుంది. గ్యాస్ వంటి ఇబ్బందుల నుండి ఉపశమనం కలిగేలా చేస్తుంది. అంటేకాకుండా అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.
Also Read: విపరీతమైన డిప్రెషన్, గుండె జబ్బులకు కారణం కరోనా.. రీసెర్చ్ లో విస్తుపోయే నిజాలు..