సూపర్ స్టార్ కృష్ణ కాల‌ర్ ప‌ట్టుకున్న అక్కినేని నాగార్జున‌.. భ‌గ్గుమ‌న్న కృష్ణ అభిమానులు ఏం చేశారంటే..?

Ads

ప్రస్తుతం మ‌ల్టీ స్టారర్ చిత్రాలకు ఉన్న క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోలు కలిసి నటించడంతో వారి అభిమానులు సంబరాలు చేసుకుంటారు. అయితే మ‌ల్టీ స్టార‌ర్స్ సినిమా అంటే మేకర్స్ కి రిస్క్ ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఏ హీరోపాత్ర త‌గ్గినా, ఏదైనా తేడా అనిపించినా అభిమానులు ఊరుకోరు. ఆర్ఆర్ఆర్ మూవీ విషయంలో మరోసారి నిరూపణ అయ్యింది.

Ads

అయితే ప్రస్తుతం సోష‌ల్ మీడియా ఉండడం వల్ల ఫ్యాన్స్ బాధ అర్థం అవుతుంది. అయితే అప్పట్లో అభిమానులు ఓ రేంజ్ లో తమ అభిమానాన్ని చూపించేవారు. ఇక త‌మ అభిమాన హీరో విష‌యంలో ఏమైనా తేడా వ‌స్తే వాళ్ళు చేసే ర‌చ్చ‌ మామూలుగా ఉండేది కాదు. సూపర్ స్టార్ కృష్ణ, నాగార్జున కలిసి న‌టించిన వార‌సుడు చిత్రం విష‌యంలో అప్పట్లో ఇలాంటిదే జ‌రిగింది. 1993లో విడుదల అయిన వార‌సుడు సినిమా ఆ సంవత్సరం అతిపెద్ద హిట్ గా నిలిచింది.
ఈ చిత్రానికి డైరెక్టర్ ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అదీ కాకుండా స్టార్ హీరోల‌తో మూవీ చేయ‌డం ఈవీవీ స‌త్య‌నారాయ‌ణకి తొలిసారి. ఈ మూవీని నటుడు ముర‌ళీమోహ‌న్ సొంత బ్యానర్ అయిన జ‌యభేరి బ్యాన‌ర్ పై రూపొందించారు. ఇక ముర‌ళీమోహ‌న్ కు కూడా అగ్ర నటులతో చిత్రం చేయ‌డం తొలిసారి కావ‌డం విశేషం. ఈ చిత్రంలో న‌గ్మ హీరోయిన్ గా న‌టించింది. ఇక ఈ చిత్రంలో మాస్ మహారాజ ర‌వితేజ విద్యార్ధి పాత్ర‌ చేయగా, శ్రీకాంత్ విల‌న్ రోల్ లో న‌టించాడు.
ఈ  సినిమా పెద్ద హిట్ అయినప్ప‌టికీ సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు మాత్రం బ‌గ్గుమ‌న్నారు. ఎందుకంటే ఈ మూవీలో నాగార్జున కృష్ణ‌ను వాడు వీడు అని పలకడం, ఆయన కాల‌ర్ ప‌ట్టుకోవ‌డం, సినిమాలో సూపర్ స్టార్ కృష్ణకు త‌క్కువ ప్రాధాన్యత ఇవ్వ‌డంతో  ఆయన అభిమానులు చాలా హ‌ర్ట్ అయ్యారు. దాంతో  మూవీని ఆపేయాల‌ని థియేట‌ర్ల ముందు స్ట్రైక్ కు దిగారు. అప్పుడు సూపర్ స్టార్ కృష్ణ అభిమానులకు నచ్చ చెప్పారు. ఇక మూవీ చివ‌ర‌లో కృష్ణ‌కు ఒక ఫైట్ షూట్ చేసి సినిమాని మ‌ళ్లీ రిలీజ్ చేశారు.
Also Read: ఆస్కార్ గెలుచుకుని చరిత్ర సృష్టించిన ‘నాటు నాటు పాట’ గురించి ఈ విషయాలు తెలుసా?

Previous articleచాణక్యు నీతి ప్రకారం ఈ లక్షణాలు ఉన్నవారికి విజయం బానిస అవుతుంది..
Next articleఎండల నుండి రక్షణ పొందేందుకు 6 పానీయాలు..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.