Ads
టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మాస్ మహా రాజ రవితేజ లాంటి స్టార్ హీరోలు తమ కెరీర్ లో ఎన్నో హిట్ చిత్రాలలో నటించారు. వారి చిత్రాలతో బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేశారు. అలాగే ఈ హీరోల చిత్రాలకు ఆడియెన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది.
Ads
ఇక బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మహేష్ బాబు రాజమౌళితో చేయబోయే సినిమా ద్వారా అంతర్జాతీయంగా గుర్తింపు పొందే అవకాశముంది. ఈ ఇద్దరు హీరోలు వారి కెరీర్ మొదట్లో కొందరు డైరెక్టర్స్ తో సినిమాలు చేశారు. అయితే వారిలో ఒక డైరెక్టర్ ప్రస్తుతం జీవించి లేరు. ఆయన చిన్న వయసులోనే కన్నుమూశారు. ఇంతకి ఆ దర్శకుడు ఎవరో? ఆయనకి ఏమయ్యిందో ఇప్పుడు చూద్దాం.. ఆ డైరెక్టర్ శోభన్. ఆయన రాంగోపాల్ వర్మ, కృష్ణవంశీ దగ్గర పని చేశారు. అలా మురారి సినిమా టైమ్ లో మహేష్ బాబుతో ఏర్పడిన పరిచయం వల్ల ఆయన సినిమాకు దర్శకుడిగా చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా బాబీ. ఈ చిత్రంలో మహేష్ బాబు, ఆర్తి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరిచింది. ఆయన రెండవ సినిమా వర్షం. ప్రభాస్, త్రిష నటించిన ఈ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరో ప్రభాస్ సినీ కెరీర్ లో వచ్చిన మొట్ట మొదటి బ్లాక్ బస్టర్ హిట్. ఈ మూవీతో ప్రభాస్, త్రిష స్టార్స్ గా మారిపోయారు. దర్శకుడు శోభన్ వర్షం తరువాత మూడవ సినిమా రవితేజ హీరోగా చంటి చేశారు. అయితే ఈ చిత్రం యావరేజ్ గా నిలిచింది. ఈ సినిమా అనంతరం ఆయన మరో మూవీ తీసే పనుల్లో భాగంగా హీరోయిన్ భూమిక ఇంట్లో ఉన్న సమయంలో హఠాత్తుగా గుండెపోటు రావడంతో కూలబడిపోయాడు. వెంటనే శోభన్ ని ఆసుపత్రికి తరలించారు. కానీ ఆయన అప్పటికే మరణించాడని డాక్టర్స్ తెలిపారు. అప్పటికి ఆయనకు 40 ఏళ్లు.
శోభన్ భార్య పేరు సౌజన్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇండస్ట్రీలో ముగ్గురు అగ్ర హీరోలతో చిత్రాలు చేసిన దర్శకుడు శోభన్ మధ్యలోనే కన్నుమూయడం టాలీవుడ్ కి నష్టమని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆయన కుమారుడు సంతోష్ శోభన్ హీరోగా సినిమాలను చేస్తూ టాలీవుడ్ లో గుర్తింపు సంపాదించుకున్నాడు.
Also Read: సూపర్ స్టార్ కృష్ణ కాలర్ పట్టుకున్న అక్కినేని నాగార్జున.. భగ్గుమన్న కృష్ణ అభిమానులు ఏం చేశారంటే..?