న్యాయదేవత కళ్ళకి గంతలు ఎందుకు కట్టి ఉంటాయి ..? కారణం ఏమిటి అంటే..?

Ads

న్యాయదేవత కళ్ళకి గంతలు కట్టి ఉంటాయి. ఈ విషయం మనకి తెలుసు. బయట కోర్టులో మనం చూడక పోయినా సినిమాల్లో మనం దీన్ని చూసే ఉంటాము. సినిమాల్లో కోర్టు సన్నివేశాలు కనబడినప్పుడు దీన్ని మీరు గమనించే ఉంటారు. కానీ చాలా మందికి ఎందుకు న్యాయ దేవత కళ్ళ కి గంతలు కట్టి ఉంటాయి అనేది తెలీదు.. మీరు కూడా ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా…? అయితే దీన్ని ఇప్పుడే చూసేయండి.

కోర్టు కి రకరకాల వ్యక్తులు వస్తూ ఉంటారు. అయితే ఎవరు వచ్చినా సరే న్యాయం కోసమే. కోర్టు కి వచ్చే వారిలో తప్పు చేసిన వాళ్ళు కొందరైతే..

Ads

ఏ తప్పు చెయ్యకుండా న్యాయం కోసం చూసే వాళ్ళు ఇంకొంత మంది. ఎంతో మంది ఇలా కోర్టు కి వస్తూ వుంటారు. వాళ్ళు అందరు కూడా రకరకాల చోట్ల నుండి రకరకాల బ్యాక్ గ్రౌండ్ ల నుంచి వస్తూ ఉంటారు. అయితే ఎప్పుడు కూడా డబ్బు ని కానీ అధికారం ని కానీ సామాజిక హోదా ని కోర్టు లో చూడరు. డబ్బు, సామజిక హోదా, అధికారం వంటివి అస్సలు చూడమని.. ఇవి ఏమి కూడ చూడకుండా అందరికీ సమానమైన న్యాయం కలగాలని సింబాలిక్ గా న్యాయ దేవత కళ్ళ కి గంతలు ఉంటాయి.

న్యాయ దేవత కళ్ళ కి గంతలు కట్టి ఉండడానికి కారణం ఇదే. ఏ కేసు కి అయినా సరే రెండు వైపులా వ్యక్తులు ఉంటారు వాళ్ళిద్దరికీ కూడా సమానమైన న్యాయాన్ని ఇస్తుంది కోర్టు. అలానే తప్పు చేసే వాళ్ళకి శిక్ష పడాలని న్యాయ దేవత చేతి లో ఖడ్గం కూడా ఉంటుంది. ఇంకో చేతిలో తూకం ఉంటుంది. ఇది ఇరు వైపుల వాళ్లకి కూడా సమానం అయిన న్యాయాన్ని కల్పించడానికి సూచిస్తుంది.

Previous articleడాక్టర్ల చేతిరాత ఎందుకు అలా ఉంటుంది…? కారణం ఇదే..!
Next articleబ్రేకప్ కంటే బాధని ఇచ్చే… 8 ఇళయరాజా పాటలు ఇవే..!