డాక్టర్ల చేతిరాత ఎందుకు అలా ఉంటుంది…? కారణం ఇదే..!

Ads

డాక్టర్లు చేతి రాత మనకి అర్థం కాదు. అది స్పష్టంగా ఉండదు. ఎవరికీ అర్థం కాకుండా ఉంటుంది డాక్టర్ల చేతిరాత. ఎలా మెడికల్ షాప్ వాళ్లకి అర్థం అవుతుంది అనేది కూడా మనకి తెలియదు. అయినా సరే మెడికల్ షాప్ వాళ్ళు కరెక్ట్ గా మందులని ఇస్తారు అది వేరే విషయం. అయితే డాక్టర్ల హ్యాండ్ రైటింగ్ ఎందుకు ఇలా ఉంటుంది.. దాని వెనుక కారణం ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

అందరి హ్యాండ్ రైటింగ్ కూడా మంచిగా ఉండాలని ఏమీ లేదు కొందరి డాక్టర్లు హ్యాండ్ రైటింగ్ స్వతహాగా అలానే ఉంటుంది. ఇంకొంత మందికి రాసి రాసి హ్యాండ్ రైటింగ్ అలా మారిపోతూ ఉంటుంది.

Ads

పైగా పదే పదే అవే మందులని రాయడం వలన చిరాకు వస్తుంది. దీంతో బాడ్ హ్యాండ్ రైటింగ్ తోనే ప్రిస్క్రిప్షన్ రాస్తారు. కొంత మంది డాక్టర్ల దగ్గర చూస్తే పేషెంట్లు క్యూ లో ఉంటూ ఉంటారు అటువంటప్పుడు చేతి రాతపై దృష్టి పెట్టలేదు. తక్కువ సమయం ఉండడం ఎక్కువ పేషెంట్లు ఉండడం వలన డాక్టర్లు చేతి రాత మీద ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేయరు. స్పీడ్ గా చేతి రాత మీద దృష్టి పెట్టకుండా ప్రిస్క్రిప్షన్ ని రాసేస్తారు.

ఒకవేళ కనుక వాళ్ళు మంచిగా హ్యాండ్ రైటింగ్ మీద దృష్టి పెట్టి ప్రిస్క్రిప్షన్ రాయాల్సి వస్తే ఎక్కువ సమయం పడుతుంది. అప్పుడు వాళ్ళకి సమయం సరిపోదు. అంత మంది పేషంట్లని కూడా చూడడానికి అవ్వదు. అందుకని డాక్టర్లు హ్యాండ్ రైటింగ్ మీద దృష్టి పెట్టరు వేగంగా వాళ్ళ పని అయిపోవడానికి చూస్తారు. సో వాళ్ళ టైం కి అలా ప్రెస్క్రిప్షన్ స్లోగా రాస్తే కుదరదు అందుకని చకచకా రాసేస్తూ ఉంటారు. అందుకనే డాక్టర్ల చేతిరాత అలా ఉంటుంది.

Previous articleనిద్రపోయేటప్పుడు అస్సలు ఈ 4 తప్పులని చెయ్యకండి… మీకే సమస్య..!
Next articleన్యాయదేవత కళ్ళకి గంతలు ఎందుకు కట్టి ఉంటాయి ..? కారణం ఏమిటి అంటే..?