జానీ సినిమా ప్లాప్, వరల్డ్ కప్ మిస్, పెప్సీ డ్రింక్ ఫెయిల్… పవన్ కళ్యాణ్ కి దెబ్బ మీద దెబ్బ..!

Ads

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఇప్పుడే కాదు పాతికేళ్ల ముందు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి విపరీతమైన క్రేజ్ ఉండేది. పవన్ కళ్యాణ్ నటించిన జానీ సినిమా గురించి చెప్పక్కర్లేదు. జానీ సినిమా గురించి ప్రేక్షకులు అప్పట్లో ఎంతగానో ఎదురు చూశారు. ఎందుకంటే వరుస హిట్ సినిమాలు తో దూసుకు వెళ్ళిపోతున్న పవన్ కళ్యాణ్ కి తిరుగులేదు అన్నట్లుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా జానీ సినిమా గురించి ఎదురు చూశారు.

కానీ సినిమా మాత్రం డిజాస్టర్ అయ్యింది. 2003లో ఈ సినిమా భారీ ఎక్స్పెక్టేషన్స్ రిలీజ్ అయిన కూడా విజయం సాధించలేకపోయింది. పవన్ కళ్యాణ్ దర్శకత్వం లో సినిమా రావడం తో చాలామంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అదే టైంలో పెప్సీ సౌత్ ఇండియాలో ప్రొడక్ట్స్ కోసం బ్రాండ్ అంబాసిడర్ గా పవన్ కళ్యాణ్ తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.

నిజానికి ఒక అంతర్జాతీయ సంస్థ కి సౌత్ ఇండియాలో బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం అదే మొదటిసారి. ఖుషి సినిమా వచ్చి తర్వాత మళ్లీ సినిమాలు రాకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు అప్పుడే ఈ సినిమా గురించి అనౌన్స్ చేశారు. జానీ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర వేరుగా ఉంటుంది.

Ads

ఇప్పటివరకు అలాంటి పాత్ర పవన్ కళ్యాణ్ చేయలేదు. అదే మొదటిసారి. అందుకోసం తన ఆహారపు అలవాటులని మార్చుకుని టైం తీసుకుని పవన్ కళ్యాణ్ సినిమా చేశారు. పైగా విదేశాలకి వెళ్లి మార్షల్ ఆర్ట్స్ ని కూడా పవన్ కళ్యాణ్ నేర్చుకున్నారు.  ఫైట్స్ ని కూడా జపాన్ వెళ్లి నేర్చుకుని వచ్చారు పవన్ కళ్యాణ్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ రెండు పాటల్ని కూడా పాడారు.

ఈ సినిమా రిలీజ్ చేసేటప్పుడు విద్యార్థులకు పరీక్షలు ఉన్నాయని వాళ్ళు సినిమా కారణంగా డిస్టర్బ్ అవ్వకూడదని సినిమాని పోస్ట్ పోన్ చేశారు కూడా. ఇలా చాలా మార్పులు చేసారు. అలానే వరల్డ్ కప్ మ్యాచ్ ఉందని ఏప్రిల్ నెలకి వాయిదా వేశారు. వరల్డ్ కప్ కి పవన్ కళ్యాణ్ కి కూడా సంబంధం ఉంది.

అదేంటంటే పెప్సీ ఆ సంవత్సరం స్పాన్సర్ చేసింది అప్పటికి పెప్సీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా పవన్ కళ్యాణ్ ఉన్నారు. సరికొత్త సాఫ్ట్ డ్రింక్ ని అప్పుడే పెప్సీ తీసుకొచ్చింది. పెప్సీ తరపున హైదరాబాద్లో ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ వెళ్లారు. టీమిండియా 2003లో ఫైనల్ వరకు వెళ్ళింది. ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో ఇండియా ఓటమిపాలైంది. 2003లో వరల్డ్ కప్ కి కానీ పెప్సీ డ్రింక్ కి గాని జానీ సినిమాకే కానీ కలిసి రాలేదు. లాంచ్ అయిన ఏడాదిలోనే డ్రింక్ ఆగిపోయింది.

Previous articleరోడ్డు మీద డబ్బులు దొరికితే ఏం చెయ్యాలి.. మన వెంట తీసుకు వెళ్లవచ్చా..?
Next article25 ఏళ్ల కంటే తక్కువ వయసులో… పెళ్లి చేసుకున్న మంది నటీమణులు వీళ్ళే…!