Ads
చాలామంది రెస్టారెంట్లకి వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేస్తూ ఉంటారు. దానితో పాటుగా కోక్, పెప్సీ ఇలా డ్రింక్స్ ని తీసుకుంటూ వుంటారు. ఇంట్లో కూడా చాలా మంది డ్రింక్స్ లేదంటే లస్సీ వంటివి చేసి ఉంచుకుంటూ వుంటారు. బిర్యానీ తిన్న తర్వాత ఎక్కువగా దాహం వేస్తుంది. అందుకే కూల్ డ్రింక్స్ ని నీళ్ళని ఇలా ఎవరికి ఇష్టమైన వాటిని వాళ్ళు తాగుతూ ఉంటారు. అయితే ఎందుకు బిర్యానీ తిన్న తర్వాత మనకి బాగా దాహం వేస్తుంది..? దాని వెనక కారణమేమిటి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా మనం బిర్యానీ వంటివి తీసుకున్నప్పుడు మనకి దాహం ఎక్కువగా అనిపించి బిర్యాని తిన్న తర్వాత జ్యూసులని కూల్ డ్రింక్ లని తీసుకుంటూ ఉంటాము అయితే కేవలం బిర్యానీ ఏ కాదు ఏ ఆయిల్ ఫుడ్ తీసుకున్నా తర్వాత అయినా సరే దాహం ఎక్కువగా వేస్తుంది. ఎందుకు ఆయిల్ ఫుడ్ ని తీసుకున్నాక దాహం బాగా వేస్తుంది అనే విషయానికి వస్తే దీనికి కారణాలు ఇక్కడ ఉన్నాయి చూసేయండి.
Ads
- ఆయిల్ ఫుడ్ తీసుకున్న తర్వాత సలైవా ప్రొడక్షన్ బాగా తగ్గుతుంది దీంతో నోరు ఆరిపోతుంది. నోరు ఆరిపోవడం వలన మనకు దాహం బాగా వేస్తుంది. అందుకని ఎక్కువ లిక్విడ్స్ తీసుకుంటూ ఉంటాం.
- ఆయిల్ ఫుడ్ తీసుకున్న తర్వాత దాహం పెరుగుతుంది ఈ కారణంగానే మనం నీళ్లను ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం.
- ఆయిల్ ఫుడ్స్ లో కొవ్వు చాలా ఎక్కువగా ఉంటుంది అవి జీర్ణం అవ్వాలంటే ఎక్కువ టైం పడుతుంది. దీంతో మనకి నీళ్లు ఎక్కువ అవసరమవుతాయి.
- అలానే సాల్ట్ కూడా ఆయిల్ ఫుడ్స్ లో ఎక్కువగా ఉంటుంది. శరీరంలోకి సాల్ట్ వెళ్లిన తర్వాత దాన్ని బ్యాలెన్స్ చేయడానికి నీళ్లు అవసరం అవుతాయి ఈ కారణంగా కూడా మనకి దాహం ఎక్కువగా వేస్తుంది. అందుకే ఆయిల్ ఫుడ్ తీసుకున్న తర్వాత మనకి దాహం ఎక్కువగా వేస్తుంది.