పుష్ప 2 ట్రైలర్ తో గరికపాటికి.. సుకుమార్, అల్లు అర్జున్ పంచ్…!

Ads

అల్లు అర్జున్ ఫ్యాన్స్ పుష్ప-2 సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా 2021 డిసెంబర్ 17న రిలీజ్ అయింది బన్నీ ఇమేజ్ ని పాన్ ఇండియా లెవెల్ కి తీసుకెళ్ళింది పుష్ప సినిమా. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన నటించి ఆకట్టుకున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో ఈ సినిమా వచ్చింది. ఇక పుష్ప రెండవ పార్ట్ ది రూల్ సినిమా ఎలా ఉంటుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.

మొన్న వచ్చిన ‘వేర్ ఈజ్ పుష్ప” కూడా అందర్నీ ఆకట్టుకుంది పైగా లేడీ గెటప్ లో అల్లు అర్జున్ ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పుష్ప వన్ రిలీజ్ అవ్వగానే అందరూ ఎర్రచందనం స్మగ్లర్ అయిన పుష్పాను ఎందుకు హీరోగా ప్రాజెక్ట్ చేస్తున్నారు అంటూ ఆడి పడేసుకున్నారు. గరికపాటి నరసింహారావు వంటి వేదాంతులు మేధావులు ఒక దొంగని హీరోను చేసి చూపిస్తే సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని పుష్ప సినిమా చూసి ఆడిపోసుకున్నారు.

Ads

అంతేకాకుండా ఇటువంటి సినిమాలు మన సంస్కృతిని పాడు చేస్తాయని పిల్లల్ని చెడగొడతాయని కూడా అన్నారు. అయితే సుకుమార్ పుష్ప టు లో వీటన్నిటికీ సమాధానం ఇచ్చినట్లే వుంది. ఈ మూవీ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది దీంతో అందరి అంచనాలు మించి పోయాలా ఉన్నట్లు తెలుస్తోంది. పుష్ప 1 లో స్మగ్లర్ గా కనపడిన పుష్ప ని అంతా కూడా విలన్ అని అనుకున్నారు కానీ ఎర్రచందనం ద్వారా పుష్పకి వచ్చిన కోట్ల డబ్బుతో అతను ఏం చేశాడు అనేది రెండో పార్ట్ లో చూపించారు. తాజాగా విడుదలైన టీజర్ లో పుష్పను పోలీసులు వెంటాడుతూ ఉంటారు. పుష్పాకి బులెట్స్ కూడా తగిలాయి.

పుష్ప బాడీ దొరకకపోవడంతో చిత్తూరు జిల్లా మొత్తం అట్టుడికిపోతుంది జనాలు అందరూ కూడా పుష్ప కోసం ఆందోళన చెందడం చూపించారు. ఈ క్రమంలో పుష్ప చేసిన పనులు అన్నిటిని కూడా అక్కడ వాళ్ళు గుర్తు చేసుకుంటారు. పెళ్లిళ్ల కోసం పుష్ప చేసిన సహాయం గుండె ఆపరేషన్లు వీటన్నింటి కోసం కోట్ల రూపాయలని పుష్ప ఖర్చు చేస్తాడు అన్నట్లు చూపించారు. పుష్ప బతకాలని జనాలంతా కూడా పూజలు చేస్తారు. మొదటి పార్ట్ లో విలన్ గా పుష్పని చూపించారు అయితే ఇప్పుడు రెండవ పార్ట్ లో హీరోగా పుష్పని మార్చేశారు. ఈ టీజర్ తో పుష్ప విలన్ కాదని హీరో అని జనం కోసమే డబ్బులు ఖర్చు చేశాడని అర్ధం అవుతోంది. మరి గరికపాటి వంటి వారు ఇప్పటికైనా విమర్శలు ఆపుతారేమో చూడాలి..

Previous articleRavanasura Movie Review : ఈ సినిమా హిట్టా, ఫట్టా..? సినిమా ఎలా ఉంది అంటే..?
Next articleబిర్యాని తిన్నాక దాహం ఎందుకు ఎక్కువ వేస్తుంది…? దాని వెనుక కారణం ఏంటో తెలుసా..?