హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు.. CPR ని ఎలా చెయ్యాలి..?, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి..?

Ads

ఈ మధ్యకాలంలో హృదయ సంబంధిత సమస్యగా ఎక్కువ అయిపోయాయి. ఎప్పుడు ఎవరికి గుండెపోటు వస్తుందనేది చెప్పలేము. వయసు తో కూడా సంబంధం లేక పోయింది. అయితే గుండెపోటుతో ఎవరైనా కుప్పకూలిపోతే ఆ మనిషిని తిరిగి సిపిఆర్ చేసి బతికించొచ్చు. సిపిఆర్ అంటే కార్డియో పల్మొనరీ రెసస్కిటేషన్.

కార్డియో పల్మొనరీ రెసస్కిటేషన్ తో మళ్ళీ ఆ వ్యక్తిని బతికించవచ్చు. గుండె ఆగిపోవడాన్ని కార్డియాక్ అరెస్ట్ అని అంటారు. 200 కంటే ఎక్కువ సార్లు గుండె కొట్టుకుని ఆగిపోతే కూడా కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. ఇక ఇప్పుడు సీపీఆర్ ఎలా చేయాలో చూద్దాం.

ముందు తప్పక ఈ జాగ్రత్తలు తీసుకోండి…

ముందు అంబులెన్స్ కి కాల్ చేయండి. సీపీఆర్ చేయడానికి ముందు అంబులెన్స్ ని పిలవాలి. చేతికి పల్స్ ఉందా లేదా అనేది కూడా చూడండి. పడిపోయిన వ్యక్తి గుండె మీద చేయి పెట్టి వాళ్ళ గుండె కొట్టుకుంటుందా లేదా అనేది చూడాలి. గుండె కొట్టుకోవడం కానీ చేతి మీద పల్స్ కానీ లేకపోతే వెంటనే సీపీఆర్ చేయాలి.

ఛాతి మధ్యలో రెండు చేతులను ఒకదానిపై ఒకటి పెట్టుకుని నొక్కాలి. గుండె పై భాగంలో స్టెర్నమ్ అనే ఎముక ఉంటుంది. దాని మీద అలానే ఛాతి మధ్యలో ఉండే మేనుబ్రియం ఎముక మీద నొక్కుతూ ఒత్తిడి చేయాలి. అలా అని ఎక్కువ, తక్కువ ఒత్తిడి చేయకూడదు. బ్యాలెన్సింగ్ గా చేయాలి గుర్తుపెట్టుకోండి. కానీ సున్నితంగా నొక్కండి. పక్కటెముకలు మీద కాదు.

Ads

సీపీఆర్ చేసే విధానం:

  1. బహిరంగ ప్రదేశంలోకి తీసుకెళ్లి పడుక్కోబెట్టండి. చేతులతో ఛాతి మధ్యలో బలంగా నొక్కండి. 30 సార్లు అలా రిపీట్ చేయాలి. నోటిలో నోరు పెట్టి మధ్య లో ఊదుతూ ఉండాలి. స్పృహ వచ్చే వరకూ కూడా చేయాలి. పేపర్ ని పైప్ గా చేసి గాలి ఊడచ్చు. ఇలా చేస్తే ఊపిరితిత్తులు స్టిమ్యులేట్ అవుతాయి. ఊపిరి అందుతుంది.
  2. ఇలా చేసిన కూడా ఊపిరి అందకపోతే… రోగి రెండు కాళ్ళు ని నిటారుగా లేపండి. అప్పుడు శరీరం దిగువ భాగం లో ఉన్న బ్లడ్ మళ్ళీ గుండెకు వెళ్లి. గుండె పని చేస్తుంది.

3. హార్ట్ బీట్ వచ్చాక పల్స్ ని చెక్ చేయండి. మీరు పల్స్ వాల్యూమ్ బాగుందా, లేదా..? పల్స్ క్రమంగా వస్తోందా లేదా అనేది చూడాల్సి వుంది.
4. ఈలోగా అంబులెన్స్ వచ్చేస్తుంది. ప్రాణానికి ప్రమాదం ఉండదు. సీపీఆర్ ఎవరైనా చేయవచ్చు. అవగాహన ఉంటే.

సీపీఆర్ చేసేటప్పుడు ఇవి అస్సలు మరచిపోవద్దు:

  • శ్వాస ఆగిపోకుండా చూసుకోవాలి
  • హార్ట్ బీట్ వచ్చేలా చూడాలి
  • పిల్లలకు, శిశువులకు కూడా ఇలానే చెయ్యాలి. పిల్లలకు ఛాతి మధ్యలో ఒక చేత్తోనే నొక్కుతూ ఉండాలి.
    శిశువుకి సీపీఆర్ చేసేటప్పుడు రెండు వేళ్ళతో మాత్రమే నెమ్మదిగా ప్రెస్ చెయ్యాలి.

 

Previous articleవెన్నని ఎందుకు శ్రీకృష్ణడు దొంగలించేవాడు..? దాని వెనుక కారణం ఇదే..!
Next articleVirupaksha Movie Heroine Samyuktha Menon Age, Biography, Movies, Family Details