వెన్నని ఎందుకు శ్రీకృష్ణడు దొంగలించేవాడు..? దాని వెనుక కారణం ఇదే..!

Ads

కృష్ణుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి. కన్నయ్య, గోపాలుడు, చిన్ని కృష్ణ, కొంటె కృష్ణ, వెన్నదొంగ ఇలా ఎన్నో.. శ్రీకృష్ణుడుని హిందువులు పూజిస్తూ ఉంటారు. చెడుని అంతం చేసి మంచిని పెంచాలని శ్రీకృష్ణుడు అవతరించాడు. శ్రీకృష్ణుడు గురించి చెప్పడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి. శ్రీ కృష్ణుడు గోవులతో పాటు తిరిగేవాడు అలానే ఎంతో అల్లరి చేసేవాడు ఊళ్లో అందరి ఇంట్లోనూ దూరి వెన్నదొంగలించి తినేవాడు. చిన్ని కృష్ణుడు అంటే అందరికీ ఇష్టమే.

వయసులో ఉన్న ఆడపిల్లలు మొదలు పెద్ద వాళ్ల వరకు చిన్ని కృష్ణుడిని ఎంతగానో ఇష్టపడతారు. జీవితంలో ఏ కష్టం వచ్చినా కూడా వాటిని అధిగమించే శక్తిని భగవద్గీతలో ప్రసాదించిన స్ఫూర్తిదాత ఆయన. చిన్నప్పుడు ఆయన చేసే అల్లరి వల్ల యశోద చేత చివాట్లు తిన్నాడు. అందరి ఇంట్లోనూ దూరి వెన్నని దొంగలించేవాడు కృష్ణుడు.

Ads

ఎందుకు చిన్ని కృష్ణుడు అల్లరి కృష్ణుడుగా అందరి ఇంట్లోనూ దూరి వెన్నని దొంగలించేవాడు దాని వెనుక కారణం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కృష్ణుడు అందరి ఇంట్లోనూ దూరి వెన్న ని దొంగలించడమే కాదు వెన్నలా స్వచ్ఛమైన మనసు కలవాడు వెన్న ఎంతో తెల్లగా ఉంటుంది. మన హృదయాలు కూడా మచ్చలేనివిగా ఉండాలని హృదయం వెన్నెలా ఉండాలని ఆ ఉద్దేశంతోనే వెన్నని దొంగలించేవాడు. కోపం, అహం, ద్వేషం, అసూయ వంటివి ఎవరిలోనూ ఉండకూడదని శ్రీకృష్ణుడి ఉద్దేశం. ఈ కారణంగానే వెన్నను దొంగలించే వారిని కొందరి అభిప్రాయం.

ఇంకొందరి అభిప్రాయం ప్రకారం శ్రీకృష్ణుడు తన భక్తుల చేతిలో చివాట్లని తినడానికి కూడా సిద్ధమే అని అందుకే అలా చేసే వాడు అని. అలానే శ్రీకృష్ణుడు తన భక్తుల మనసుని దోచేయడం వెన్నను దొంగలించడం అంటే అని ఇంకొంత మంది అంటారు. నిజానికి కృష్ణుడు తన స్నేహితులతో గోకులంలోని ఇళ్లల్లో వెన్నని దొంగలించి అందరి మధ్య ఐక్యతను చాటాడు. పైగా వాళ్లలో ఎంతో శారీరక బలాన్ని కూడా చేకూర్చాడు శ్రీకృష్ణుడు. ఇలా శ్రీకృష్ణుడు వెన్నని దొంగలించడం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆకతాయిగా అల్లరి చేయాలని కూడా కన్నయ్య అందరి ఇంట్లో దూరి వెన్నని దొంగలిస్తూ ఉండేవాడు.

Previous articleగడప మీద కాలు ఎందుకు పెట్టకూడదు..? కారణం ఏమిటి..?
Next articleహార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు.. CPR ని ఎలా చెయ్యాలి..?, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి..?