Ads
చిన్నపిల్లల్ని చూసుకోవడం చాలా కష్టం. పిల్లలు రాత్రిపూట నిద్ర పోరు పైగా పేచీ పెడుతూ ఉంటారు. ఎందుకు ఏడుస్తున్నారు అనేది కూడా మనకి తెలీదు. నిద్ర పట్టకో లేకపోతే ఆకలో కూడా అర్థం కాదు. నిజానికి చంటి పిల్లల తల్లికి ఎంతో కష్టంగా ఉంటుంది నిద్ర కూడా ఉండదు. అప్పుడే పుట్టిన పిల్లలు, ఏడాది దాటకుండా ఉన్న పిల్లలు రాత్రిపూట విపరీతంగా పేచీ పెడుతూ ఉంటారు రాత్రి నిద్ర పోనివ్వకుండా తల్లుల్ని ఏడిపించడానికి వాళ్ళు ఏడుస్తారు ఏమో..
ఉదయం మాత్రం చక్కగా నవ్వుతూ ఆడుకుంటూ ఉంటారు కానీ రాత్రి మాత్రం చాలా ఇబ్బంది పెట్టేస్తుంటారు. దాని వెనుక కారణం ఏమిటి..? ఎందుకు రాత్రిపూట వాళ్ళు నిద్రపోకుండా ఏడుస్తారు అనేది చూస్తే.. కొంత మంది పిల్లలు పగటిపూట ఎక్కువగా నిద్రపోతుంటారు. కొంతమంది పిల్లలు రాత్రిపూట నిద్రపోతూ ఉంటారు. రాత్రిపూట నిద్రపోయే పిల్లలైతే పగలు విపరీతంగా పేచీ పెడతారు ఎక్కువమంది పిల్లలు రాత్రిపూట నిద్రపోకుండా బాగా పేచి పెడతారు.
Ads
దీనికి కారణం అలసట, ఫ్రస్టేషన్. పిల్లలకు కూడా ఇది ఉంటుంది అయితే ఇవి పర్మినెంట్ గా ఉండవు అప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. ఆకలితో ఉన్నప్పుడు ఎక్కువగా పిల్లలు ఏడుస్తారు. పాలు ఇస్తే నిద్రపోతారు. అయితే పాలు వెంటనే జీర్ణం అయిపోతాయి అందుకే మళ్ళీ ఆకలితో ఏడుస్తారు. రాత్రిపూట బాగా ఎక్కువ ఆకలితో ఉంటారు. ఆకలి వలన వాళ్ళు నిద్ర పోలేక పోతారు. పైగా పిల్లలు ఎదిగేది రాత్రి సమయంలోనే కాబట్టి ఆ టైంలో బాగా పేచీ పెడతారు ఒకవేళ కనుక పాలు పట్టినా వాళ్ళు ఇంకా ఏడుస్తున్నారంటే జలుబు, ఎలర్జీ, కడుపులో గ్యాస్ వంటి సమస్యలు అవ్వచ్చు. మలబద్ధకం వలన కూడా పిల్లలు ఏడుస్తూ ఉంటారు.
దంతాల సమస్య ఉంటే కూడా పిల్లలు ఏడుస్తారు. ఒక్కోసారి వేడి వలన కూడా పేచీ పెడతారు. గదిలో గాలి సరిగ్గా లేకపోయినా అసౌకర్యంగా అనిపించి పిల్లలు ఏడుస్తారు. పిల్లల్ని కంఫర్ట్ గా చూసుకోవాలి. వేడిగా ఉంటే కాస్త గాలి ఆడేటట్టు చూడాలి. గ్యాస్ సమస్య కూడా పిల్లల్లో ఉంటుంది శిశువుకి మసాజ్ చేస్తే గ్యాస్ నుండి ఉపశమనం లభిస్తుంది. కొంతమంది పిల్లలైతే తల్లిదండ్రుల ప్రేమని రాత్రి పూట కోరుకుంటారు సమయాన్ని తల్లిదండ్రులతో గడపాలి అనుకుంటారు అందుకు కూడా ఏడుస్తూ ఉంటారు.