ఒకే ఒక్క పాటతో ఫేమస్ అయిన ఈ అబ్బాయి ఎవరో తెలుసా..? ఇతని తల్లిదండ్రులు కూడా మనకి బాగా తెలిసిన వాళ్లే..!

Ads

కొంత మందికి ఫేమస్ అవ్వాలి అంటే సంవత్సరాలు కష్టపడాల్సి వస్తుంది. కానీ కొంత మంది మాత్రం ఒక్క రోజులో ఫేమస్ అయిపోతారు. కానీ అలా ఒక్క రోజు రావడం కోసం వెనుక కూడా చాలా సంవత్సరాల కష్టం ఉంటుంది.

అలా ఒక్క సినిమాతో కానీ, ఒక్క పాటతో కానీ ఫేమస్ అయిన వారు చాలా మంది ఉన్నారు. ఫేమస్ అయిన విషయం మాత్రమే అందరికీ తెలుసు.

boy in katchi sera song

కాని దాని వెనుక వాళ్ళ ఎన్ని సంవత్సరాల కష్టం ఉందో ఎవరికి తెలియదు. ఇటీవల ఒక వ్యక్తి అలా ఒక తమిళ్ పాటతో ఫేమస్ అయ్యారు. సాధారణంగా భాషా భేదం లేకుండా ఏ పాట అయినా కూడా దేశమంతా వ్యాపిస్తోంది.  ఇప్పుడు ఈ పాట కూడా అలాగే ట్రెండింగ్ లో ఉంది. ఈ పాట పేరు కట్చి సేర. ఈ పాటలో ఒక అబ్బాయి పాడుతూ ఉంటే, మరొక అమ్మాయి డాన్స్ వేస్తూ ఉంటుంది.

boy in katchi sera song

ఆ డాన్స్ వేస్తున్న అమ్మాయి పేరు సంయుక్త. ఆమె ఇప్పటికే చాలా పాపులర్ అయిపోయింది. అయితే పాడే అబ్బాయి గురించి మాత్రం ఎక్కువగా వివరాలు బయటకు రాలేదు. ఆ అబ్బాయి పేరు సాయి అభ్యంకర్. ఈ పాటని తనే కంపోజ్ చేసి, పాడి, ఆ పాటలో నటించాడు. సాయి అభ్యంకర్ గతంలో ఏఆర్ రెహమాన్ దగ్గర అడిషనల్ ప్రోగ్రామర్ గా పని చేశాడు.

boy in katchi sera song

Ads

విక్రమ్ హీరోగా నటించిన కోబ్రా సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం కంపోజ్ చేశారు. ఈ సినిమాకి సాయి అభ్యంకర్ కూడా పని చేశాడు. అయితే సాయి అభ్యంకర్ తల్లిదండ్రులు కూడా మనకి బాగా తెలిసిన వారే. ఎన్నో సంవత్సరాల నుండి వారి పాటలతో అలరిస్తున్నారు. వారు ఎవరో కాదు టిప్పు, హరిణి. నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో ఉన్న మాట చెప్పనీవు పాట వీరిద్దరూ కలిసి పాడారు.

boy in katchi sera song

అయితే, వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అనే విషయం ఇప్పుడు చాలా మందికి తెలియకపోవచ్చు. సినిమాల్లోకి వచ్చాక వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సాయి అభ్యంకర్ వీరిద్దరి కొడుకు. సాయి అభ్యంకర్ వయసు 19 సంవత్సరాలు మాత్రమే. సాయి అభ్యంకర్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటాడు. తన వర్క్ కి సంబంధించిన విషయాలని షేర్ చేస్తూ ఉంటాడు. సినిమాల్లో పాడడం, పాటలు కంపోజ్ చేయడం మాత్రమే కాకుండా బయట కూడా ఎన్నో స్టేజ్ ప్రదర్శనలు ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఎన్నో స్టేజ్ పెర్ఫార్మెన్స్ లు ఇస్తున్నాడు.

watch video :

ALSO READ : మిర్చి మూవీలో డార్లింగే పాటలో హీరోయిన్ అనుష్క ప‌క్క‌న స్టెప్పులు వేసిన ఈ సైడ్ డ్యాన్స‌ర్ ఎవరో తెలుసా?

Previous articleపిల్లలు రాత్రిపూట ఎందుకు ఎక్కువగా ఏడుస్తారు..? కారణం ఏమిటో తెలుసా..?
Next articleపెళ్లి సమయంలో అబ్బాయిలకి ఇన్ని కష్టాలు ఎదురవుతున్నాయా..? ఈ వ్యక్తి చెప్పింది నిజమేనా..?