Ads
ప్రతి రోజు కూడా కొన్ని వేల మంది తిరుమల వెళ్తూ ఉంటారు తిరుమల వెళ్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. మీరు కూడా తిరుమల వెళ్ళాలని అనుకుంటున్నారా..? తిరుమల వెళ్లే వాళ్లందరికీ కూడా ముఖ్య గమనిక తిరుమలకు నడిచి వెళ్లే భక్తులకి దివ్య దర్శనం టోకెన్లని జారీ చేసే కేంద్రానికి సంబంధించి TTD కొన్ని మార్పులు చేసింది నిన్నటి వరకు అలిపిరి నుండి కాలినడకన వచ్చే భక్తులకి గాలి గోపురం దగ్గర దివ్యదర్శనం టోకెన్ లని ఇస్తున్నారు శుక్రవారం నుండి టికెట్లని అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లోనే జారీ చేస్తున్నారు.
టోకెన్లు తీసుకున్న భక్తులు అలిపిరి కాలినడక మార్గంలోని గాలిగోపురం దగ్గర ఉన్న కేంద్రంలో పక్కాగా స్కాన్ చేయించుకోవాలి. స్కాన్ చేసుకోకపోతే ఏమవుతుంది అనే విషయానికి వస్తే… ఇతర మార్గాల్లో తిరుపతి వెళ్లి చేతులో టికెట్ ఉండి కూడా స్కాన్ చేయకపోతే దర్శనానికి పర్మిషన్ ఇవ్వరు.
Ads
నడక మార్గం శ్రీవారి మెట్టు మార్గంలో జారీ చేస్తున్న దివ్యదర్శన టోకెన్లను ఎప్పుడు ఇస్తున్నట్లే ఇస్తారు. 1250వ మెట్టు దగ్గర ఈ టికెట్లు ఇస్తారు. రోజుకి టీటీడీ ఎనిమిది వేల టోకెన్లని జారీ చేస్తుంది. ఒకరోజు కోటా పూర్తి అయిపోతే నెక్స్ట్ రోజు టోకెన్లు ని కూడా జారీ చేసేందుకు తాత్కాలిక ఆదేశాన్ని ఇచ్చింది అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో టైం స్లాట్ సర్వదర్శన టోకెన్ల కేంద్రాన్ని విష్ణు నివాసం యాత్రికుల వసతి సముదాయానికి TTD మార్చేసింది.
ఫ్రీ దర్శనం టోకెన్లను బస్టాండ్ కి దగ్గర శ్రీనివాసము, రైల్వే స్టేషన్ సమీపం లోని గోవిందరాజస్వామి సత్రాలులో మాత్రమే ఇస్తారు. వాహనాల్లో తిరుమలకు వస్తే ఎస్.ఎస్.డి టోకెన్స్ ని ఇస్తారు. శ్రీనివాసం, ఆర్.టి.సి. బస్టాండ్ ఎదురుగా.. విష్ణునివాసం, రైల్వేస్టేషన్ ఎదురుగా.. గోవిందరాజసత్రాలు, తిరుపతి రైల్వేస్టేషన్ వెనుక. భక్తులు వీటిని గమనించాలి అని టీటీడీ కోరింది.