Vidudhala Part 1 Review – విడుదల మూవీ రివ్యూ… సినిమా ఎలా వుంది అంటే..?

Ads

సినిమా: విడుదల
నటీనటులు : సూరి, భవాని శ్రీ, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఇళవరసు తదితరులు.. స్పెషల్ రోల్ లో విజయ్ సేతుపతి
దర్శకత్వం : వెట్రిమారన్
నిర్మాత : ఎల్రెడ్ కుమార్
సంగీతం : ఇళయరాజా
విడుదల తేదీ :ఏప్రిల్ 15, 2023

స్టోరీ :

కుమరేషన్ (సూరి) కొత్తగా ఉద్యోగంలో పోలీస్ కానిస్టేబుల్ గా చేరుతాడు. ఒక కొండ ప్రాంతంలో పోస్టింగ్ వస్తుంది. అక్కడ పోలీసులకి, ప్రజాధళం సభ్యులకు ఎన్కౌంటర్లు.. ఒక్కళ్ళ మీద ఇంకొకళ్ళపై చేయిగా ఉండడానికి ఏమి చేయాలనే ప్లాన్స్ వేస్తారు. ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలని అక్కడ ఫ్యాక్టరీలు కట్టిస్తామని చెప్తుంది. పోలీస్ క్యాంప్ లని కూడా నడుపుతూ ప్రైవేట్ కంపెనీ వారితో కలిసి క్యాంప్ ని నిర్వహిస్తుంది. అక్కడ ప్రజాదళం నాయకుడైన పేరుమాల్ (విజయ్ సేతుపతి) ని పట్టుకునేందుకు వర్క్ చేస్తున్న పోలీస్ టీం కి ఒక రోజు జీపులో ఆహారం ఇవ్వడమే కుమరేషన్ పని.

ప్రజలకి కష్టం వస్తే ఆదుకోవడమే పోలీస్ విధి అని అతను నమ్ముతాడు. కుమారేషన్ పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాకా ఎలాంటి పరిస్థితులను ఎదురయ్యాయి,,? పేరుమాళ్ ని పట్టుకోవడానికి ఏం చేసారు. అటవీ ప్రాంతంలోని మహిళలపై పోలీసుల అరాచకాలు..? పోలీసుల అరాచకాలను అడ్డుకోవడానికి సూరి ఏం చేసాడు..? ఇదే కథ.

Ads

రివ్యూ:

ఈ సినిమాని వెట్రిమారన్ చాలా భిన్నంగా తీశారు. బలహీనులపై బలవంతుల దౌర్జన్యాలు ఈ మూవీ ద్వారా చూపించారు. సమాజంలో అసమానతలను సినిమాల ద్వారా చెప్పారు. పోలీస్ శాఖకు వ్యతిరేకంగా తీసుకు రాలేదు. విజువల్ పోయెట్రీగా చూపే ప్రయత్నం చేశారు వెట్రిమారన్. వేల్ రాజ్ సినిమాటోగ్రఫీ ప్రేక్షకులను 80వ దశకంలోకి మనల్ని వెనక్కి తీసుకు వెళ్తుంది.

ఇళయరాజా సంగీతం బాగుంది. కానీ రెండే పాటలు వున్నాయి. యాక్షన్ సీన్లు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. కొత్తదనం లేదు. సూరి పాత్ర ఠాగూర్ లో ప్రకాష్ రాజ్ లాగ ఉంటుంది. మహిళలు, పురుషులు అనే వ్యత్యాసం లేకుండా బట్టలని విప్పిస్తారు. కొంత మంది ప్రేక్షకులు అలాంటి సీన్స్ ని చూడలేరేమో… పార్ట్ 2 కోసం అసలు కథను మొత్తం దాచేసారేమో అనే ఫీలింగ్ ఉంటుంది.

ప్లస్ పాయింట్స్:

  • పతాక సన్నివేశాలు ఆకట్టుకుంటాయి
  • నటీనటులు
  • కథ
  • సూరి నటన
  • ఇళయరాజా రీరికార్డింగ్
  • వెల్ రాజ్ సినిమాటోగ్రఫీ
  • మూవీ మేకింగ్
  • మాటలు
  • హైలెట్ అయిన కొన్ని సన్నివేశాలు

మైనస్ పాయింట్స్:

  • రొటీన్ స్టోరీ
  • ఇంటరాగేషన్ సీన్స్
  • ముగింపు
  • సాగదీత సన్నివేశాలు

రేటింగ్: 3/5

 

Previous articleగుప్త నిధులు గుడిలో ధ్వజస్తంభం కింద ఎందుకు ఎక్కువగా దొరుకుతాయి… కారణం ఏమిటంటే..?
Next articleతిరుమల వెళ్లే వాళ్ళు.. మారిన ఈ రూల్స్ ని తప్పక తెలుసుకోవాలి..!