Ads
ట్రైన్ లో ట్రావెల్ చేయడం బాగుంటుంది. చాలా మంది దూర ప్రయాణాలు చేయాలనుకుంటే ట్రైన్ ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మీరు కూడా ఎక్కువ ట్రైన్ లో వెళ్తూ ఉంటారా..? అయితే కొన్ని నియమాలని తప్పకుండా మీరు తెలుసుకోవాలి. ట్రైన్లో వెళ్లే వాళ్ళు అసలు ఈ పొరపాట్లని చేయకూడదు ఈ పొరపాటున చేస్తే ఎంతగానో ఇబ్బంది పడాలి. జరిమానాతో పాటు జైలు కి కూడా వెళ్లాల్సి ఉంటుంది. ట్రైన్ లో ట్రావెల్ చేసే వాళ్ళు ఎక్కువ లగేజీని తీసుకు వెళుతూ ఉంటారు ట్రైన్ లో ఏమైనా తీసుకు వెళ్లాలంటే దానికి లిమిట్ ఏమీ ఉండదు ఎవరికి నచ్చినన్ని వాళ్ళు తీసుకు వెళ్ళచ్చు.
కానీ ఎప్పుడైనా ట్రైన్ లో వెళ్తున్నప్పుడు మీ ఇష్టానుసారంగా వస్తువులని తీసుకెళ్లకండి. ముఖ్యంగా ఈ నాలుగు వస్తువులను పొరపాటును కూడా పట్టుకెళ్లకూడదు. పట్టుకెళ్లారంటే జైలు శిక్ష జరిమానా తప్పదు. ట్రైన్ లో ట్రావెల్ చేసేటప్పుడు యాసిడ్ బాటిల్స్ ని తీసుకు వెళ్ళకూడదు.
Ads
యాసిడ్ బాటిల్స్ ని తీసుకెళ్లడం పూర్తిగా నిషేధం ప్రయాణికుడు కనుక యాసిడ్ బాటిల్ ని తీసుకువెళ్తే సెక్షన్ 164 కింద అరెస్ట్ చేస్తారు. వెయ్యి రూపాయలు లేదా మూడేళ్లు జైలు శిక్ష విధించవచ్చు. కాబట్టి ట్రైన్ లో వెళ్తున్నప్పుడు యాసిడ్ బాటిల్ ని తీసుకెళ్లొద్దు. అలానే ట్రైన్ లో వెళ్లేటప్పుడు బాంబులు వంటివి తీసుకెళ్లకూడదు ఇలాంటివి తీసుకెళ్తే ప్రాణం నష్టం కలగొచ్చు. ట్రైన్ లో పటాకులు తీసుకువెళ్తే కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటారు. భారీ జరిమానా కూడా తప్పదు.
గ్యాస్ స్టవ్లు సిలిండర్లు కూడా తీసుకెళ్లకూడదు. రైల్వే చట్టం ప్రకారం ఇవి తీసుకెళ్లడం తప్పు. వీటిని తీసుకెళ్తే జైలు శిక్ష లేదంటే జరిమానా విధిస్తారు. ఆయుధాలను కూడా ట్రైన్లో తీసుకెళ్లకూడదు లైసెన్స్ ఉన్న ఆయుధాలని కూడా తీసుకెళ్లకూడదు. దీని వలన ఇతరులకి నష్టం కలగవచ్చు ఒకవేళ వీటిని తీసుకెళ్లినట్టు పట్టుపడితే జరిమానా జైలు శిక్ష తప్పదు.