శ్రీదేవితో బాలకృష్ణ ఎందుకు నటించలేదు..? కారణం ఇదే..!

Ads

అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శ్రీదేవి బాల నటిగా తన కెరీర్ ని మొదలుపెట్టింది. తర్వాత చాలామంది టాప్ హీరోల సరసన నటించి అందరినీ ఆకట్టుకుంది. బాలకృష్ణ కూడా బాలా నటుడిగానే తన కెరీర్ ని మొదలుపెట్టారు. సీనియర్ హీరోలలో బాలకృష్ణ కూడా ఒకరు. అయితే ఇంత పెద్ద హీరో అయినప్పటికీ శ్రీదేవితో బాలకృష్ణ ఒక్క సినిమా కూడా చేయలేదు. శ్రీదేవి 1978లో పదహారేళ్ళ వయసు సినిమాలో హీరోయిన్ గా కనపడింది తర్వాత చాలా తెలుగు సినిమాలు చేసింది. 1970లో వచ్చిన మా నాన్న నిర్దోషి సినిమాలో ఈమె బాలనటిగా కనపడి అలరించింది.

1974 నుండి బాలకృష్ణ బాల నటుడిగా సినిమాలు చేయడం మొదలుపెట్టారు. తాతమ్మ కల సినిమాతో బాలకృష్ణ తెలుగు ప్రేక్షకులకి పరిచయమయ్యారు తర్వాత మంగమ్మగారి మనవడు, భలే దొంగ, రామ్ రహీం ఇలా చాలా సినిమాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు.

Ads

శ్రీదేవి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి పెద్ద హీరోల పక్కన నటించారు. అయితే మరి బాలకృష్ణతో ఎందుకు సినిమా చేయలేదు దాని వెనుక కారణం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.. రాఘవేంద్ర రావు 1987లో శ్రీదేవి బాలకృష్ణ తో ఒక సినిమా చేయాలని అనుకున్నారు. సినిమాని అనౌన్స్ చేశారు కూడా. సినిమా పేరు సామ్రాట్ అని కూడా పెట్టారు. ఇది ఇలా ఉంటే 1989లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో భలే దొంగ సినిమా తీసుకురావాలని అనుకున్నారు.

అందులో హీరోయిన్ గా శ్రీదేవిని పెట్టాలనుకున్నారు కానీ శ్రీదేవి ఫుల్లుగా బిజీగా ఉండడంతో ఈ సినిమాలు బాలకృష్ణతో చేయడానికి ఒప్పుకున్నా కూడా చేయలేకపోయారు. అప్పట్లో శ్రీదేవి వరుస హిందీ సినిమాతో బిజీగా ఉన్నారు. దాంతో బాలకృష్ణ పక్కన నటించలేదు. కానీ బాలకృష్ణ, శ్రీదేవి కొంటె కృష్ణుడు, రౌడీ రాముడు, అనురాగ దేవత వంటి సినిమాల ఫ్రేమ్ లో కనపడ్డారు కానీ జంటగా శ్రీదేవి బాలకృష్ణ ఏ సినిమా చేయలేదు.

Previous articleఅర్జునుడు… కర్ణుడు… ఇద్దరిలో బలవంతుడు ఎవరు..? పురాణాలు ఏం చెప్తున్నాయి అంటే..?
Next articleఅందరి మనసులు గెలిచి… లక్షల మంది అభిమానులను సంపాదించుకున్నారు..! ఈ వ్యక్తి ఎవరో తెలుసా..?