అందరి మనసులు గెలిచి… లక్షల మంది అభిమానులను సంపాదించుకున్నారు..! ఈ వ్యక్తి ఎవరో తెలుసా..?

Ads

చాలామందికి చాలా కలలు ఉంటాయి. అందరూ వాటిని నెరవేర్చుకునే దిశగా జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కొందరు తాము కన్న కలలు నెరవేర్చుకుంటే, మరికొందరు నెరవేర్చుకోలేక పరిస్థితులకు తలవంచి జీవిస్తూ ఉంటారు. అయితే మనం ఒకటి తలిస్తే దేవుడు ఇంకోటి తలచాడని… మనం కన్న కల కన్నా దేవుడు ఇంకొక గొప్ప అవకాశాన్ని మనకు అందిస్తే…. దానితో మన జీవితమే మారిపోతే… ఇప్పుడు మీరు చదవబోయేది అలాంటి కథే….

మురల వెంకటేష్… ఈ పేరేంటే ఎవరికీ తెలియకపోవచ్చు గాని సోషల్ మీడియాలో ఈయన చేసే కుకింగ్ వీడియోస్ చూస్తే అరే ఈయన అని అనకుండా ఉండరు… ఫుడ్ అండ్ ఫామ్ పేరుతో ఒక సోషల్ మీడియా అకౌంట్ ని క్రియేట్ చేసి అందులో కుకింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ బాగా ఫేమస్ అయ్యారు.ఒకసారి ఆయన కథ గురించి తెలుసుకుంటే..హోటల్ పెట్టాలనే తన జీవితకలను నెరవేర్చుకునే దిశగా ఒక రోడ్డు సైడ్ దాబాలో వంటవాడిగా చేరారు.

తర్వాత తన కలను నెరవేర్చుకునే దశలో అంతా సాఫీగా సాగుతున్న సమయంలో లాసెస్ రావడం, నమ్మిన వాళ్లు మోసం చేయడంతో మళ్ళీ కథ ముందుకు వచ్చింది. అయినా వెనకడుగు వేయకుండా తన నమ్మకాన్ని ముందుకు తీసుకు వెళ్తూ మళ్లీ తన ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. తన కుటుంబంతో పాటు వేరే చోటకు వెళ్లిపోయి ఒక టిఫిన్ సెంటర్ ని స్టార్ట్ చేశారు. ఈ ప్రయత్నంలో అతని భార్య తనకి పూర్తి మద్దతుగా నిలబడింది. ఆర్టీసీలో ట్రాన్స్పోర్టేషన్ రూల్స్ మారడంతో మళ్లీ ఇబ్బందులు ఎదురయ్యాయి.

ఈసారి ఒక రూరల్ ప్రాంతానికి మకాం మార్చారు.ఐటీ కంపెనీలో ఒక సంవత్సరం పాటు భోజనాన్ని అందించారు. అయినా ఎక్కడో ఒక వెలితి ఉండడంతో తన సొంత ఊరు అయిన కర్నూల్ కి వచ్చేసారు. అప్పులు కారణంగా ఉన్నదంతా అమ్ముకున్నారు. కరోనా వల్ల హోటల్ ని మూసేయాల్సి వచ్చింది.  అప్పుడే వాళ్ళ జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన జరిగింది. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ గా పని చేసే వీళ్ళ అబ్బాయి వినూత్నంగా తన తండ్రిని పెట్టి కుకింగ్ వీడియోస్ చేయాలని అనుకున్నాడు. అలా ఫుడ్ ఆన్ ఫార్మ్ స్టార్ట్ అయింది.

పలు కుకింగ్ వీడియోస్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని తన తండ్రికి ఉన్న 45 సంవత్సరాల అనుభవాన్ని ఉపయోగించుకుని ప్రకృతిలో వంట వీడియోస్ చిత్రీకరించేవాడు. అలా ఏడు వీడియోస్ చేసిన తర్వాత ఆపేశారు. టిఫిన్ సెంటర్ నడపడం వీడియోస్ తీయడం ఇలా రెండింటికీ సమయం సరిపోయేది కాదు. అయినా కూడా తన కొడుకు వెనకడుగు వేయకుండా వీడియోస్ చేస్తూనే ఉన్నాడు. అలా చేసిన 19 వీడియో వీళ్ళ జీవితాన్నే మార్చేసింది.

ఎన్నో బ్రాండ్లు వీళ్ళ కొలాబ్రేషన్ కోసం రాగా వాటన్నిటిని రిజెక్ట్ చేసి సాంప్రదాయ పద్ధతి వంటని ప్రజలకు పరిచయం చేయాలని నిర్ణయించుకున్నారు. వీడియోస్ ని వినూత్నంగా చిత్రీకరించి పోస్ట్ చేయడంలో వీళ్ళ అబ్బాయి సక్సెస్ అయ్యాడు. అలా పాత కాలం నాటి వంటలన్నీ ప్రజలకు పరిచయం చేస్తూ కుటుంబమంతా కలిసి చేసే పనిలో విజయవంతమయ్యారు. కృషి పట్టుదల నమ్మకం చేయగలను అనే తపన ఉంటే విజయం చేయబడుతుంది అనడానికి మీ కుటుంబమే ఒక ఉదాహరణ. మురల వెంకటేష్ జీవితమే మనకి ఆదర్శం.

Ads

watch video :

 

Previous articleథియేటర్లలో ఫ్లాప్ అయినా… OTT లో సూపర్ హిట్ అయ్యింది..! ఈ సినిమా చూశారా..?
Next article”ఈతరంలో కోడళ్ళు ఇంటి పనులు చేసేందుకు ఎందుకు ఇష్టపడట్లేదు”..? ఈ ప్రశ్నకు ఒక అమ్మాయి చెప్పిన జవాబు ఏంటంటే…?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.