Ads
సినిమా: ఉగ్రం
నటీనటులు : అల్లరి నరేష్, మీర్నా మీనన్, ఇంద్రజ, శరత్ లోహితస్వ, శత్రు తదితరులు
దర్శకత్వం : విజయ్ కనకమేడల
నిర్మాత : సాహు గారపాటి, హరీష్ పెద్ది
సంగీతం : శ్రీచరణ్ పాకల
విడుదల తేదీ : 05,మే 2023
స్టోరీ :
సిఐ శివ కుమార్ (అల్లరి నరేష్) వరంగల్ లో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. శివ కుమార్ అపర్ణ (మీర్నా మీనన్) తో ప్రేమలో పడతాడు. తన తండ్రి వాళ్ళ పెళ్లి కి ఒప్పుకోరు. అయినా కూడా అపర్ణ ని శివ కుమార్ పెళ్లి చేసుకుంటాడు. ఐదేళ్లు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. అనుకోకుండా ఓ ప్రమాదం చోటు చేసుకుంటుంది.
కుటుంబం ఆ ప్రమాదం వలన ఛిన్నాభిన్నమైంది. శివ చూస్తే జ్ఞాపకశక్తిని కోల్పోతాడు. శివ భార్య, పిల్లాడు అదృశ్యమయ్యాడు. తన కుటుంబాన్ని కనుగొనడానికి శివ ఏం చేస్తాడు..? ఆ సమయంలో ఎలాంటి ఇబ్బందులు శివ కి ఎదురవుతాయి..? శివ కనుగొంటాడా లేదా అనేది ఈ కథ.
రివ్యూ:
2021 లో విజయ కనక మేడల నాంది సినిమాని తీసుకువచ్చాడు విమర్శకులను కూడా మెచ్చుకునే లాగ నాంది సినిమాని తీశాడు. ఇప్పుడు మళ్లీ అల్లరి నరేష్ విజయ కనకమేడల కాంబినేషన్లో ఉగ్రం సినిమా వచ్చింది. సినిమా ఆసక్తికరంగా ఓపెన్ అవుతుంది. ఇందులో ఉండే సన్నివేశాలు కూడా అందరిని ఆకట్టుకునే విధంగా ఉంటాయి. అయితే అన్నీ బాగున్నాయి కానీ క్లైమాక్స్ మాత్రం కాస్త డిసప్పాయింట్ చేసింది. అల్లరి నరేష్ మీర్నామీనన్ నటన అందర్నీ ఆకట్టుకుంటుంది.
Ads
వీళ్ళిద్దరి కాంబినేషన్లో సీన్లు బాగున్నాయి. మంచి బడ్జెట్లో రెండు పాటలు కూడా ఎంతో అద్భుతంగా తీశారు. మ్యూజిక్ విషయంలో శ్రీ చరణ్ ఏ మాత్రం ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేయలేదు. పోలీస్ గా అల్లరి నరేష్ అందరినీ బాగా ఆకట్టుకున్నారు. అయితే కొన్ని అనవసరమైన సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి. ఫైట్లు కూడా కొంచెం సాగదీశారు. అల్లరి నరేష్ మునుపెన్నడూ చేయని యాక్షన్ సీక్వెన్స్ లని ఈ సినిమాలో చేయించడం జరిగింది.
దర్శకుడు విజయ్ రాసుకున్న కథ బాగున్నా కూడా సినిమా తీసిన తీరు అంతలా ఆకట్టుకోలేదు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం నెమ్మదిగా కదులుతుంది సినిమా స్టార్ట్ అయిన 20 నిమిషాల తర్వాత నుండి మాత్రమే ట్రాక్ ఎక్కుతుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగుంది. ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే రెండవ హాఫ్ బాగుంది. మిస్టరీని రివిల్ చేయడం, థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్ సెకండ్ ఆఫ్ లో ప్రేక్షకుడికి కాస్త ఊరట ని కలిగిస్తాయి.
అయితే అంతా బాగున్నా కాస్త నెమ్మదిగా కథ కదలడం సినిమాకి మైనస్ అయ్యింది. ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చిన రైన్ ఫైట్ చాలా బాగుంది. నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉన్నాయి. స్లో నరేషన్, కథనానికి అడ్డంగా పాటలు సినిమాకి కొంచెం మైనస్ అయ్యాయి. మొత్తం మీద సినిమా యావరేజ్ గా ఉంది.
ప్లస్ పాయింట్స్:
అల్లరి నరేష్ నటన
నటీ, నటులు
ప్రొడక్షన్ విలువలు
ఇంట్రడక్షన్
రెయిన్ ఫైట్
నేపథ్య సంగీతం
సినిమాటోగ్రఫీ
కథ
ఇంటర్వెల్ సీక్వెన్స్
సెకండ్ హాఫ్
మైనస్ పాయింట్స్:
సాగదీత సన్నివేశాలు
లవ్ స్టోరీ
మొదటి హాఫ్
కథనానికి అడ్డంగా పాటలు
ఫస్ట్ హాఫ్
అనవసరమైన సెంటిమెంట్ సీన్స్
సాగదీత ఫైట్లు
రేటింగ్: 2.5/5