పెళ్లికి ముందు ట్రాఫిక్ సిగ్న‌ల్ ద‌గ్గ‌ర నీతాతో ముఖేష్ అంబానీ ఇలా ప్రవర్తించారా..? చూస్తే షాక్ అవుతారు..!

Ads

ముఖేష్ ధీరుబాయ్ అంబానీ భారత దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త. ఈయన గురించి కొత్తగా మనం చెప్పుకోక్కర్లేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థకి అధ్యక్షుడు యజమాన్య సంచాలకుడు. 1957 ఏప్రిల్ 19న జన్మించారు. ముఖేష్ అంబానీ ధీరుభాయ్, కోకిలాబేన్ అంబానీ కుమారుడు. ఈయన 1985లో నీతా అంబానీ ని పెళ్లి చేసుకున్నారు. ఆకాష్ అంబానీ, అనంత్ అంబనీ, ఇషా అంబానీ వీళ్ళ పిల్లలు.

పెళ్లికి ముందు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నీతా తో ముఖేష్ అంబానీ చేసిన చిలిపి పని మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖేష్ అంబానీ ఎప్పుడూ పక్కా ప్లానింగ్ తో ఉంటారు అలా ఉండడం బట్టే ఇప్పుడు ఈ స్థాయిలో నిలబడ్డారు. పెళ్లికి ముందు నీతా తో అతను ప్రవర్తించిన తీరును చూస్తే నవ్వు ఆపుకోలేరు.

సాధారణంగా ఎవరైనా ఇష్టమైన అమ్మాయి లేదా అబ్బాయిని ప్రపోజ్ చేసేటప్పుడు ఒక గులాబీని ఇచ్చి ప్రపోజ్ చేయడం లేకపోతే రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ముఖేష్ అంబానీ మాత్రం వెరైటీగా నీతా అంబానీ కి ప్రపోజ్ చేశారు. ఈయన చేసిన పనికి కొంచెం సేపు ట్రాఫిక్ జామ్ కూడా అయింది. ఇక అసలు ఏమైందనేది చూస్తే.. పెళ్లికి ముందు ముఖేష్ అంబానీ నీతా అంబానీ తో కారులో వెళుతున్నప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది.

Ads

దానికి ముందు నీతా డాన్స్ చూసి ముకేశ్ అంబానీ తండ్రి ధీరుభాయ్ ఆమెను తన ఇంటి కోడలుగా చేసుకోవాలని అనుకున్నారు. ఇంటికి కూడా పిలిపించారు. సంబంధం ఇంకా ఫిక్స్ అవ్వలేదు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి నీతా, ముఖేష్ ఇద్దరు కూడా డేటింగ్ లో ఉన్నారు ఆ సమయంలో కారులో వెళ్తున్నప్పుడు నీతా కి ప్రపోజ్ చేశారు ముఖేష్.

ఆమె వెంటనే యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా ఆన్సర్ ఇవ్వలేదు. అప్పుడే గ్రీన్ సిగ్నల్ పడిపోయింది. కారుని ముందుకి నడపకుండా అక్కడే ఆపేసి ముకేశ్ అంబానీ నువ్వు ఏదో ఒకటి చెప్పే వరకు కారు ముందుకి కదలదని చెప్పారు. ఇలా మొండి పట్టు పట్టారు ముఖేష్ అంబానీ. ఆ తర్వాత నీతా అంబానీ ఆయన ప్రపోజల్ కి యాక్సెప్ట్ చేశారు. అప్పుడు కారు ముందుకి కదిలింది. మార్చి 8 1985 న వీళ్ళ వివాహమైంది.

Previous articleలంకను చేరుకోడానికి స‌ముద్రంపై వంతెనని.. వానరసేన ఎన్నిరోజులులో కట్టారో తెలుసా..?
Next articleUgram movie review: అల్లరి నరేష్ ”ఉగ్రం” సినిమా హిట్టా..? ఫట్టా..?