Ads
సూపర్ రజనీకాంత్ సౌత్ సినీ పరిశ్రమ కాకుండా దేశవ్యాప్తంగా అందరికి సూపరిచితమే. అంతటి గుర్తింపును రజనీకాంత్ సంపాదించుకున్నారు. ఆయన సినిమాలలోకి రాక ముందు బస్ కండక్టర్ గా పనిచేసేవారు. ఆ తరువాత కాలంలో సినీపరిశ్రమలో అడుగు పెట్టిన రజనీకాంత్, ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు.
Ads
రజనీకాంత్ చిత్రాలు ఎలా ఉంటాయనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఇది ఇలా ఉండగా సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఆప్తమిత్రుడు అయిన జయశంకర్ మరణించినపుడు ఆఖరి చూపు చూడడానికి వెళ్లలేదంట. అయితే రజనీకాంత్ ఎందుకు మిత్రుడిని కడసారి చూడడం కోసం వెళ్లలేదో ఇప్పుడు చూద్దాం..
కోలీవుడ్ లో రజనీకాంత్ అడుగు పెట్టకముందే జైశంకర్ చాలా చిత్రాలలో నటించారు. తమిళ ఇండస్ట్రీలో ఆయనను తమిళనాడు జేమ్స్ బాండ్ గా పిలిచేవారంట. జైశంకర్ ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లోనే చేతినిండా ఆఫర్స్ తో చాలా బిజీగా ఉండేవారంట. అంతేకాకుండా ఆయన పరిశ్రమలో కొత్తగా వచ్చే దర్శకులకు, నిర్మాతలకు ఆయన పిలిచి మరి ఛాన్స్ లు ఇచ్చేవారంట. అలా జైశంకర్ అందరిని ప్రోత్సహిస్తూ ఉండేవారంట. అయితే రాను రాను పరిశ్రమలోకి కొత్తవాళ్లు రావడం ఎక్కువ అయ్యే కొద్ది జై శంకర్ కి అవకాశాలు తగ్గిపోయాయి. అలాంటి సమయంలో రజనీకాంత్ హీరోగా నటించిన మురతుక్కలై అనే చిత్రంలో జైశంకర్ విలన్ గా మెప్పించారు. ఆ సినిమాతో ఆయనలోని విలనిజాన్ని గుర్తించిన మేకర్స్ చాలా చిత్రాల్లో జైశంకర్ కు విలన్ గా ఛాన్స్ లు ఇచ్చారు.
అప్పటినుండి జైశంకర్ కు మళ్లీ అవకాశాలు రావడం మొదలయ్యాయి. అంతేకాకుండా రజనీకాంత్ హీరోగా నటించే చాలా చిత్రాల్లో జైశంకర్ ను విలన్ గా తీసుకునేవారు. అలా జైశంకర్, రజనీకాంత్ మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇక వీరి స్నేహం ఎలాంటిది అంటే రాత్రి 12 అయినా కూడా వీరు గంటల తరబడి చెప్పాలంటే లవర్స్ లాగా ఫోన్లో మాట్లాడుకునే వారంట. రజనీకాంత్ కి షూటింగ్ లేని సమయంలో తప్పనిసరిగా జై శంకర్ ఇంటికి వెళ్లి, మాట్లాడి వచ్చేవారంట. రజనీకాంత్, జై శంకర్ కలిసి నటించిన చివరి చిత్రం తలపతి. ఈ చిత్రంలో రజనీకాంత్ కి తండ్రి పాత్రలో జైశంకర్ నటించారు.
ఆ సినిమా తర్వాత కొద్ది రోజులకే జై శంకర్ అనారోగ్యంతో మరణించారు. అయితే రజనీకాంత్ కి తన ప్రాణ మిత్రుడైన జై శంకర్ మరణ వార్త తెలిసినప్పటికి కడసారి స్నేహితున్ని చూడడానికి వెళ్లలేదు. రజినీకాంత్ కి జై శంకర్ మరణ వార్త తెలిసిన వెంటనే జై శంకర్ కుమారుడికి ఫోన్ చేసి, నేను మీ ఇంటికి వచ్చిన ప్రతిసారి మీ నాన్నగారు నవ్వుతూ మాట్లాడేవారు. ఇప్పుడు ప్రాణం లేని మీ నాన్నగారిని చూసి తట్టుకునే శక్తి అయితే నాకు లేదు. అందువల్లే నేను జై శంకర్ కడసారి చూపుకు రావడం లేదు. నేను రాలేక పోతున్నందుకు తప్పుగా అనుకోవద్దని రజనీకాంత్ చెప్పారంట. అయితే ఈ విషయాన్ని జై శంకర్ కుమారుడు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Also Read: Dhanush Sir movie review: ధనుష్ ”సార్” సినిమా హిట్టా..? ఫట్టా..?