Dhanush Sir movie review: ధనుష్ ”సార్” సినిమా హిట్టా..? ఫట్టా..?

Ads

సినిమా: సార్
నటీనటులు : ధనుష్, సంయుక్త మీనన్, తనికెళ్ళ భరణి, సాయి కుమార్ తదితరులు
దర్శకత్వం : వెంకీ అట్లూరి
నిర్మాత : నాగ వంశీ, సాయి సౌజన్య
సంగీతం : జీవి ప్రకాష్ కుమార్
విడుదల తేదీ : February 17, 2023

స్టోరీ : 

(ధనుష్) బాల గంగాధర్ ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం ఊరి లో జూనియర్ కాలేజీ లో మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ విద్యార్థులు అంతా ప్యాస్ అయితే సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్ గా ప్రమోషన్ ఇస్తారని ఆశ తో ఆ కాలేజీ కి వస్తాడు. కానీ తన లో అనుకూలంగా ఉండదు. కానీ తన మాటలతో మారుస్తాడు. జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య అతని లైఫ్ లో ఎలాంటి మార్పులు వచ్చాయి..? మీనాక్షి (సంయుక్తా మీనన్)తో బాలు ప్రేమ. ఇలా ఆఖరికి బాలు లైఫ్ ఏమిటి..? ఇదే కథ.

రివ్యూ:

Ads

ఈ సినిమా లో చదువు గురించి చెప్పారు. చదువు గొప్పతనం ఏమిటనేది చూపారు. చిత్రంలో కొన్ని ఎమోషన్స్ అలానే ఈ సినిమా ద్వారా మెసేజ్ అందరినీ కదిలిస్తుంది. ఈ సినిమా లో వాస్తవిక ఎలిమెంట్స్ తో పాటు కథనం కూడా చాలా వాస్తవంగా వుంది. దానితో చూసేందుకు ఆసక్తి పెరుగుతుంది. అలానే చదువుతో వ్యాపారం చేసే వాళ్ళు ఎలా ఉంటారనేది కూడా ఇందులో చూపారు. అణగారిన వర్గాల స్టూడెంట్స్ ఎలా ప్రవర్తిస్తారనేది కూడా చెప్పారు.

ఎప్పటిలాగే ధనుష్ నటన అద్భుతంగా వుంది. మ్యాథ్స్ టీచర్ బాలుగా ధనుష్ చాలా చక్కగా నటించాడు. క్లైమాక్స్ లో కూడా ధనుష్ బాగా యాక్ట్ చేసాడు. సుమంత్, మలయాళ నటుడు హరీష్ పేరడీ కీలక పాత్రలు పోషించారు. అలానే తమిళ నటుడు ఆడుకాలం నరేన్, సముద్రఖని, తనికెళ్ల భరణి, సాయి కుమార్ తదితరులు ఎంతో బాగా ఆకట్టుకున్నారు. దర్శకుడు వెంకీ అట్లూరి కథ ని చక్కగా తెర మీద కి తీసుకు వచ్చారు. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. మెయిన్ కంటెంట్ తో పాటు కొన్ని ఎమోషనల్ సీన్స్ కి హార్ట్ కి టచ్ అవుతున్నాయి.

ప్లస్ పాయింట్స్:

  • డైరెక్షన్
  • నటీ, నటులు
  • కథ

మైనస్ పాయింట్స్:

  • కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడం
  • స్క్రీన్ ప్లే చాలా స్లో గా ఉండడం
  • సెకండ్ హాఫ్

రేటింగ్: 3/5.

 

Previous articleశివుడి పార్వతీ దేవుడికి స్వయంగా చెప్పిన ”శివరాత్రి కథ”… అందుకే ఉపవాసం, జాగరణ, బిల్వపూజ ముఖ్యం..!
Next articleనయనతార టు హన్సిక.. ముప్పై వస్తేనే కానీ ఈ 8 మంది హీరోయిన్స్ వివాహం చేసుకోలేదు..!