“తమన్నా” తో పాటు ఉన్న ఈ అబ్బాయి… ఇప్పుడు సెన్సేషనల్ హీరో అయ్యాడు..! ఎవరో కనిపెట్టగలరా..?

Ads

ఎప్పుడైనా ఏదైనా రంగంలో సక్సెస్ అయిన వారి ప్రయాణం అంత సులభంగా సాగదు. కేవలం వారి సక్సెస్ మాత్రమే మనకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం ఉంటుంది. ముఖ్యంగా సినిమా రంగం గురించి మాట్లాడుకుంటే, అందులోనూ నటుల గురించి మాట్లాడుకుంటే, పేరు లేని పాత్రలు ఎన్నో వాళ్ళు చేసి, తర్వాత సక్సెస్ అవుతారు. వాళ్లు పేరు తెచ్చుకున్న తర్వాత, వాళ్ల గురించి వెతికితే, అప్పుడు వాళ్ళు అంతకుముందు కొన్ని సినిమాల్లో చాలా చిన్న పాత్రలు చేసినట్టు తెలుస్తుంది.

actor with tamannaah in advertisement

ఇప్పుడు అలా ఒక హీరో గతంలో కొన్ని చిన్న పాత్రలు చేశారు. అడ్వర్టైజ్మెంట్స్ కూడా చేశారు. అందులో ఆ హీరో తమన్నాతో చేసిన ఈ అడ్వర్టైజ్మెంట్ ఒకటి. ఇందులో తమన్నా ఒక ఫోన్ కోసం అడ్వటైజ్మెంట్ చేశారు. తమన్నా ఫ్రెండ్స్ అందరూ ఒకచోట కూర్చుని సినిమాకి వెళ్దాం అని మాట్లాడుకుంటూ ఉంటే, అప్పుడు తమన్నా వచ్చి ఫోన్ లో చాలా సినిమాలు చూసే సదుపాయం ఉంది అని చెప్తారు. ఈ ఫోన్ లో అంత పెద్ద మెమరీ కార్డ్ వాడే సౌలభ్యాన్ని కల్పించారు అని చెప్తారు. తమన్నా మాట్లాడుతున్న మాటలకి ఆశ్చర్యపోతూ ఉంటారు తమన్నా ఫ్రెండ్స్. వారిలో ఒకరు ఈ వ్యక్తి.

Ads

ఇతను ఇప్పుడు చాలా పెద్ద హీరో అయ్యారు. అతనే విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో నటించారు అని తెలుసు. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన నువ్విలా సినిమాలో కూడా ఒక పాత్ర పోషించారు అని తెలుసు. కానీ తమన్నాతో కలిసి ఒక అడ్వర్టైజ్మెంట్ లో నటించారు అనే సంగతి మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సినిమాల్లోకి రావడం, సక్సెస్ అవ్వడం, ఇప్పుడు మంచి నటుడిగా పేరు తెచ్చుకోవడం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్ పనిలో విజయ్ దేవరకొండ బిజీగా ఉన్నారు.

watch video :

Previous articleకల్కి 2898 ఏ.డీ. సినిమాలో ఈ మిస్టేక్ గమనించారా..? ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు..?
Next articleఆమెకు 20.. నాకు 40.. మాది హ్యాపీ లైఫ్..! వ‌య‌స్సు అనేది నా దృష్టిలో ఒక నెంబ‌ర్ అంతే..!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.