Ads
సాధారణంగా వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన కార్యం. ఇక పెళ్లి గురించి యువతీ, యువకులు అనేక కలలుకంటారు. ఇక పెద్దవాళ్ళు అమ్మాయి, అబ్బాయిల పెళ్లికి అన్నిటితో పాటుగా ఏజ్ గ్యాప్ ను కూడా ముఖ్యంగా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు.
Ads
సాధారణంగా పెళ్లి చేసుకునే అమ్మాయి అబ్బాయి మధ్య ఏజ్ గ్యాప్ ఐదు సంవత్సరాలు ఉండాలని అంటారు. అంతకన్నా ఎక్కువ అయితే ఇద్దరి అభిరుచుల్లో, ఆలోచనల్లో, అలవాట్లలోనూ తేడాలు వస్తాయని, దాంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి, విడిపోయే అవకాశాలు ఉంటాయని అంటారు. అయితే ఇక్కడ ఒకతను పెళ్లికి వయసుతో పని లేదని, అది ఒక నంబర్ మాత్రమే అని చెప్తున్నాడు. అదేమిటో చూద్దాం రండి. అది అతని మాటల్లోనే..నాకు 40 ఏళ్లు, నా భార్యకు 20 ఏళ్లు అంటే మా ఇద్దరి మధ్య 20 ఏళ్ల వయసు గ్యాప్ ఉన్నప్పటికీ మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాము. మేము ఇద్దరం కూడా అర్థం చేసుకుంటూ, తన అభిప్రాయాలను నేను నా అభిప్రాయాలను తను గౌరవించుకుంటూ సంతోషంగా జీవిస్తున్నాం. ఆమె వయస్సులో చిన్న అయినా, ఆలోచనలో, అణకువలో, అర్థం చేసుకోవడంలో తాను ముందుంటుంది.
ఇక నాకు నాన్ వెజ్ నచ్చదు. కానీ ఆమెకు నాన్ వెజ్ ఇష్టం. అయినా నా కోసం నాన్ వెజ్ మానేసింది.
తనకు డ్రెస్ వేసుకోవడం ఇష్టం ఉన్నా, ఏజ్ గ్యాప్ ను తెలియనియకుండా చీరలు కట్టుకుంటుంది.
నేను ఇల్లు చిందరవందరగా చేస్తే, ఆమె నీట్ గా చేస్తూ ఉంటుంది. నేను ఫిట్ గా ఉండడం కోసం జిమ్ చేయడం అలవాటు, తనకు సపోర్ట్ చేస్తుంది. ఇలా అన్ని విషయాల్లోనూ అర్థం చేసుకునే మనస్సు ఉండడం అనేది ముఖ్యం. అంతేకాని వయస్సు కాదు. నా దృష్టిలో వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే ఇలాంటి అమ్మాయి నాకు భార్యగా దొరకడం నా అదృష్టం.
Also Read: గోమూత్రం ఇంట్లో చల్లడం వాళ్ళ కలిగే ప్రయోజనం ఏమిటో తెలుసా?