సినిమాల్లో నటుల బట్టలు ”మురికి” గా కనపడాలంటే ఏం చేస్తారు…?

Ads

సినిమాను తెర మీదకి తీసుకు రావడానికి ఎంతో శ్రమ పడుతూ ఉంటారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ సినిమాని షూటింగ్ చేస్తారు. అన్నిటికంటే కూడా ప్రొడక్షన్ విలువలు ఎంతో రిచ్ గా ఉండాలి లేకపోతే క్వాలిటీ అవుట్ పుట్ రాదు. డైరెక్టర్ ఏ చిన్న విషయాన్ని అయినా సరే జాగ్రత్తగా చూసుకుంటూ రావాలి. సినిమాకి సంబంధించి ఏదైనా తప్పు కనపడితే చాలు ఇక మోత మోగిపోతుంది.

అలానే సినిమాలలో హీరో హీరోయిన్లు ఇతర పాత్రలు చేసే వాళ్ళు వేసుకునే దుస్తులు పట్ల కూడా జాగ్రత్త వహిస్తారు కాస్ట్యూమ్ డిజైనర్లు. ఎక్కువగా బ్రాండెడ్ దుస్తుల్ని వాడుతూ ఉంటారు.

కొన్ని కొన్ని సార్లు రెంట్ కి తెచ్చి కాస్ట్యూమ్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఒక్కొక్కసారి నటులు డీగ్లామర్ లుక్ లో నటించాల్సి వస్తుంది. మంచి దుస్తులు, బ్రాండెడ్ దుస్తులు వేసుకోవడానికి కుదరదు. కాస్త మురికిగా ఉండే బట్టల్ని వేసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తారు? అలాంటి బట్టల్ని ఎక్కడి నుంచి తీసుకువస్తారు..? ఈ సందేహం మీకు కూడా కలిగిందా మరి దాని జవాబు ఇక్కడ ఉంది చూసేయండి. దుస్తులు మురికిగా కనపడడానికి డైరెక్టర్స్ ఒక టెక్నిక్ ని ఉపయోగిస్తారు.

Ads

బాగా పాపులర్ అయిన సినిమాలు ఉదాహరణగా తీసుకోవాలంటే రంగస్థలం, పుష్పా ఏ. డీగ్లామర్ లుక్ లో ఈ సినిమాలో హీరోలు కనపడతారు. పుష్ప లో అల్లు అర్జున్ బట్టలు చూస్తే మురికిగా కనపడతాయి. అలానే రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ దుస్తులు కూడా అలానే కనపడుతూ ఉంటాయి. అయితే ఈ దుస్తులు అలా కనపడడానికి టీ లేదా కాఫీ ని ఉపయోగించి వాటిలో బట్టల్ని ముంచి తీసి తర్వాత ఎండబెడతారు. ఇలా చేయడం వలన దుస్తులు మురికిగా కనబడతాయి. వాళ్ల పాత్రకి తగ్గట్టుగా ఉంటాయి. ఈ విషయాన్ని నేను చెప్పడం లేదు గతం లోనే సుకుమార్ ఒక సారి చెప్పారు ఇలానే పాత్రలకి తగ్గట్టుగా మురికి దుస్తులు తయారు చేస్తారట.

Previous articleఈ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా? ప్రస్తుతం ఆమె స్టార్‌ హీరోయిన్‌..
Next articleహనుమాన్ సినిమాలో హీరోయిన్‌లో ఇది VFX చేసారా..? దీని అవసరం ఏం ఉంది..?