హనుమాన్ సినిమాలో హీరోయిన్‌లో ఇది VFX చేసారా..? దీని అవసరం ఏం ఉంది..?

Ads

‘హనుమాన్’ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ హీరోల  సినిమాలతో పోటీగా సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ మూవీ సంచలనం సృష్టించింది. పాన్ ఇండియా మూవీగా జనవరి 12న విడుదల అయ్యి, తొలి షోతోనే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

హనుమాన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ ని వసూల్ చేసి, పలు రికార్డులను బ్రేక్ చేసింది. ఆల్ టైమ్ సంక్రాంతి హిట్ గా నిలిచింది. వీఎఫ్ఎక్స్ పరంగా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ మూవీలో తేజ సజ్జా, అమృత అయ్యర్ జంగా నటించారు. తాజాగా ఈ మూవీలోని సాంగ్ కు చెందిన అమృత అయ్యర్ వీడియో క్లిపింగ్ వైరల్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
తేజ సజ్జ హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ భారీ కలెక్షన్స్ సాధించి, బయ్యర్స్ కి భారీ లాభాలను ఇచ్చింది. బాలీవుడ్ లో కూడా విజయం సాధించింది. ప్రశాంత్ వర్మ ఈ మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారాడు. హీరోగా నటించిన తేజ సజ్జకి మంచి పేరు వచ్చింది.
సినిమా రిలీజ్ అయి అందర్నీ మెప్పించింది. ఈ మూవీ రిలీజ్ అయ్యాక, ఆదిపురుష్ మూవీతో పోలుస్తూ హనుమాన్ చాలా బాగుందని   అభినందించారు. 400 కోట్ల రూపాయలతో భారీ బడ్జెట్ తో హాలీవుడ్ లో గ్రాఫిక్స్ చేయించిన ఆదిపురుష్ మూవీని దేశవ్యాప్తంగా ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. హనుమాన్ మూవీని ప్రశాంత్ వర్మ 25 కోట్ల రూపాయల బడ్జెట్ లో అద్భుతమైన గ్రాఫిక్స్ చేశారు అని మెచ్చుకున్నారు.
అయితే తాజాగా సోషల్ మీడియాలో హనుమాన్ మూవీలోని సాంగ్ కు సంబంధించిన వీడియో క్లిపింగ్ నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇందులో హీరోయిన్ అమృత అయ్యర్ పళ్లకు వీఎఫ్ఎక్స్ చేసినట్టుగా గమనించారు. ఈ వీడియోని చూసిన నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఆమె ఒరిజినల్ పళ్ళే బాగున్నాయని, వీఎఫ్ఎక్స్ అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: ఈ సూపర్ హిట్ సినిమాలో వీళ్ళిద్దరే నటించాల్సింది.. కానీ మరో నటితో హిట్ కొట్టిన నాగార్జున! ఏ సినిమా అంటే.?

Previous articleసినిమాల్లో నటుల బట్టలు ”మురికి” గా కనపడాలంటే ఏం చేస్తారు…?
Next articleరకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి పత్రిక చూసారా..? ఇందులో ఏం రాసి ఉంది అంటే..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.