Ads
కొన్ని సినిమాల్లో పాత్రలు ప్రేక్షకులకి ఎంతో కాలం వరకు గుర్తుండిపోతాయి. అలా గుర్తుపెట్టుకునేలా ఒక పాత్ర ఉండాలి అంటే నటుల పర్ఫార్మెన్స్ తో పాటు డబ్బింగ్ కూడా ముఖ్యం. పాత్ర బాగుండి డబ్బింగ్ బాలేకపోతే ఆ పాత్ర తెరపై కనిపించిన ప్రతిసారి కొంచెం చిరాకుగా అనిపిస్తుంది. ఎమోషన్ సరిగా వ్యక్తపరిచే సీన్స్ లో డబ్బింగ్ చాలా ముఖ్యం. అందుకే ఎంతో మంది డైరెక్టర్లు నటీనటుల ఎంపిక తో పాటు డబ్బింగ్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. మన ఇండస్ట్రీలో డబ్బింగ్ ఆర్టిస్టులు ఎంతోమంది ఉన్నారు. వాళ్లు ఎన్నో సినిమాల్లో ఎంతో మంది ఆర్టిస్టులకు డబ్బింగ్ చెప్తారు.
అయితే ఒక హీరో ఇంకో హీరోకి డబ్బింగ్ చెప్పడం గురించి తెలుసా. అలాగే ఒక హీరోయిన్ ఇంకో హీరోయిన్ కి డబ్బింగ్ చెప్పడం. మన ఇండస్ట్రీలో ఉన్న నటులు కూడా వేరే నటులకి డబ్బింగ్ చెప్పారు. వాళ్ళలో కొంతమంది కేవలం ఒక్క సినిమాకి మాత్రమే చెప్తే, మరికొంతమంది మాత్రం వాళ్ళ వాయిస్ ఆ నటులకి క్లిక్ అవడంతో వాళ్లకి పర్మినెంట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిపోయారు. నటులకి డబ్బింగ్ చెప్పిన కొంతమంది నటులు ఎవరంటే.
#1 సాయి కుమార్ : రజినీకాంత్ – బాషా, రాజశేఖర్ – అంకుశం
Ads
#2 రమ్యకృష్ణ – సోనాలి బింద్రే – ఖడ్గం
#3. కార్తీ – సూర్య – బ్రదర్స్
#4. చార్మి – కాజల్ – చందమామ
#5. రోహిణి : గిరిజ – గీతాంజలి, ఐశ్వర్యరాయ్ – రావణన్ (తెలుగులో విలన్ )
#6. రాశి : నదియా – మిర్చి, కాజల్ అగర్వాల్ – లక్ష్మీ కళ్యాణం
#7. శివాజీ: (నితిన్ – జయం, దిల్) , యశో సాగర్ – ఉల్లాసంగా ఉత్సాహంగా, విజయ్ సేతుపతి – పిజ్జా
#8. నిత్యా మీనన్ – ఈషా తల్వార్ – గుండెజారి గల్లంతయ్యిందే
#9. కలర్స్ స్వాతి – ఇలియానా – జల్సా
#10. నాని – దుల్కర్ సల్మాన్ – ఓకే బంగారం